టిపై అధిష్టానంతో ఢీ: కిరణ్ చేతిలో సుప్రీం మరోఅస్త్రమా?
హైదరాబాద్: రాష్ట్ర విభజన అంశంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అధిష్టానంతో ఢీకొని సుప్రీం కోర్టుకు వెళ్లనున్నారా? అంటే అవకాశాలు లేకపోలేదంటున్నారు. విభజనను తాను అడ్డుకుంటానని కిరణ్ మొదటి నుండి చెబుతున్న విషయం తెలిసిందే. బుధవారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన కిరణ్ అవసరమైతే కేంద్రాన్ని కూడా ఎదిరిస్తానని వ్యాఖ్యానించారు. విభజనను అడ్డుకునేందుకు కిరణ్ ఇప్పటికే ప్రోరోగ్ అస్త్రాన్ని బయటకు తీసినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అసెంబ్లీలో తీర్మానాన్ని వ్యతిరేకించడం, ప్రోరోగ్.. ఇలా విభజనను అడ్డుకునేందుకు ప్రతి అంశాన్ని కిరణ్ పరిశీలిస్తున్నారట. సుప్రీం కోర్టుకు వెళ్లడం కూడా యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. విభజనపై సుప్రీంకు వెళ్లే విషయమై కిరణ్ సహచరులు, న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారని తెలుస్తోంది. విభజనపై సుప్రీం కోర్టుకు వెళ్లడం ద్వారా కేంద్రం, అధిష్టానంతో అమీతుమీకి కిరణ్ సిద్ధపడుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

సుప్రీం కోర్టుకు వెళ్లగలమా, వెళ్తే ఎప్పుడు వెళ్లాలి, సాధ్యాసాధ్యాలేమిటనే అంశంపై కిరణ్ దృష్టి పెట్టారట. అసెంబ్లీకి బిల్లు వచ్చి మెజార్టీ సభ్యులు వ్యతిరేకంగా ఉందని తేలాక న్యాయస్థానం మెట్లు ఎక్కితే బాగుంటుందని కొందరు సూచిస్తున్నారట. ఇటీవల సుప్రీం తీర్పు నేపథ్యంలో మరో ఆలోచన కూడా చేస్తున్నారట.
పార్లమెంటులో బిల్లు పెట్టే సమయంలో కేంద్రం కాజ్ ఆఫ్ యాక్షన్ ఏం చూపుతుందో చూసి వెళ్లాలని మరికొందరు సూచిస్తున్నారట. పబ్లిక్ డిమాండ్ అని కాజ్ ఆఫ్ యాక్షన్ కేంద్రం చూపిస్తే ప్రభుత్వం తరఫున మెజార్టీ సభ్యుల ఆమోదం లేదని సుప్రీం కోర్టుకు వెళ్లడం మంచిదని మరికొందరు సూచిస్తున్నారట. అయితే దీనిపై ఇప్పటి వరకు తుది నిర్ణయం తీసుకోనప్పటికీ సాధ్యాసాధ్యాలపై చర్చిస్తున్నారట.
కేంద్రం ఏకపక్షంగా విభజన విభజన చేస్తోందని, రాజ్యాంగ బద్దంగా విభజన ప్రక్రియ జరుగుతోందా, రాష్ట్ర అధికారాల్లో కేంద్రం జోక్యం చేసుకుంటోందంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోర్టు మెట్లు ఎక్కే అవకాశాలు లేకపోలేదంటున్నారు. విభజన ఆపేందుకు తాను ముఖ్యమంత్రి పదవి వదులుకునేందుకు కూడా సిద్ధమని కిరణ్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications