ఎపిఎన్జీవోలకు ఏం చెప్పాలి?: డిగ్గీ సలహా కోరిన కిరణ్

హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఎపిఎన్జీవోలతో చర్చలకు ముందు కిరణ్ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్‌కు ఫోన్ చేసి ఉద్యోగులతో ఏం చెప్పాలని అడిగారు.

అసెంబ్లీకి రెండుసార్లు తీర్మానం వస్తుందని, విభజన సమస్యలన్నింటినీ అసెంబ్లీలో చర్చిస్తామని వారితో చెప్పాలని కిరణ్‌కు దిగ్విజయ్ ఈ సందర్భంగా సూచించారు. దిగ్విజయ్ సలహా అనంతరం కిరణ్ ఎపిఎన్జీవోలతో జరిగిన భేటీలో ఇవే అంశాలను చెప్పారు. ఆ తర్వాత ఎపిఎన్జీవోలతో చర్చలు జరుగుతున్న సమయంలోను కిరణ్ ఫోన్లో మాట్లాడారు.

Kiran Kumar Reddy take Digvijay Singh's help

మరోవైపు ఎపిఎన్జీవోలు మాత్రం తమకు ముఖ్యమంత్రితో పాటు కేంద్రం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని తేల్చి చెప్పారు. విపత్కర పరిస్థితులు వస్తే మాత్రం తాము సహకరిస్తామని తెలిపారు. ఈ నెల 11న లేదా 12న అన్ని సంఘాలతో సమావేశమౌతున్నట్లు చెప్పారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని సమైక్యవాది గౌరవిస్తామని అయితే కేంద్రం నుండి తమకు స్పష్టమైన హామీ వస్తేనే సమ్మె విరమిస్తామని చెప్పారు. నర్సింగ్ స్టాఫ్ కూడా సమ్మె నోటీసు ఇచ్చిందని అత్యవస సేవలు వారు కొనసాగిస్తారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+