కిరణ్ రిజైన్: సచివాలయం ఖాళీ, ఆయనొక్కడే (పిక్చర్స్)
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవికి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలోనే కాకుండా ఇరు ప్రాంతాల ఉద్యోగులు, మాజీలుగా మారిన తెలంగాణ మంత్రులు ఢిల్లీలో మోహరించిన నేపథ్యంలో కూడా రాష్ట్ర సచివాలయం బుధవారం బోసిగా కనిపించింది. కిరణ్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత మంత్రుల ఛేంబర్లు కూడా ఖాళీ అయ్యాయి.
తాజా మాజీ మంత్రి రఘువీరా రెడ్డి మాత్రం బుధవారం ఉదయం సచివాలయంలోని తన ఛేంబర్‌లో కూర్చుని మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సీమాంధ్ర ఉద్యోగులు ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రెండు రోజుల పాటు ధర్నా చేశారు. దాంతో వారు సచివాలయానికి దూరంగానే ఉన్నారు.
కాగా, తెలంగాణ తాజా మాజీ మంత్రులు, ఉద్యోగులంతా ఢిల్లీలోనే ఉన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందేవరకు ఢిల్లీలోనే ఉంటామంటూ ప్రతిన చేసి వెళ్లారు. దీంతో వారెవరూ సచివాలయానికి వచ్చినట్లు లేదు.

ఆనం ఛేంబర్ ఇలా..
ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆనం రామనారాయణ రెడ్డి ఛేంబర్ బుధవారంనాడు ఇలా ఖాళీగా కనిపించింది. కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఆయన మాజీ అయిపోయారు.

సమతా బ్లాక్ నిర్మానుష్యం..
ముఖ్యమంత్రి ఛేంబర్ ఉన్న సమతా బ్లాక్ ఎల్లవేళలా సందడిగా కనిపిస్తుంది. కానీ కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామాతో అక్కడ నిర్మానుష్యం చోటు చేసుకుంది.

డి బ్లాక్ కారిడార్..
వచ్చిపోయే వారితో ఎప్పుడూ సందడిగా ఉండే సచివాలయంలో మనుష మాత్రులు కనిపించడం లేదు. డి బ్లాక్ కారిడార్ ఇలా ఖాళీగా కనిపించింది.

ఖాళీయే ఖాళీ..
సచివాలయం బుధవారంనాడు పూర్తిగా ఖాళీ అయినట్లు కనిపించింది. ఎవరూ ఆ ఛాయలకు వచ్చిన సూచనలు కనిపించడం లేదు.

టిజి వెంకటేష్ ఛేంబర్
కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో మంత్రుల ఛేంబర్ల తలుపులు మూత పడ్డాయి. చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన టిజి వెంకటేష్ ఛేంబర్ ఇలా కనిపించింది

ఫైళ్లు ఎదురుచూస్తూ..
ముఖ్యమంత్రిపై ధ్వజమెత్తుతున్న తాజా మాజీ మంత్రి బాలరాజు బల్లపై ఫైళ్లు నిరీక్షిస్తున్నాయి. కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది.

రఘువీరా రెడ్డి ఇలా..
రఘువీరా రెడ్డి మాత్రం బుధవారం ఉదయం తన ఛేంబర్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రాజీనామా వల్ల లాభం లేదని ఆయన అభిప్రాయం.












Click it and Unblock the Notifications