టికి వ్యతిరేకంగా కిరణ్, బొత్సఅఫిడవిట్: విజయమ్మ లేఖ

హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బుధవారం సభాపతి నాదెండ్ల మనోహర్‌కు అఫిడవిడ్ ఇచ్చారు. ముఖ్యమంత్రితో పాటు సీమాంధ్ర మంత్రులు, కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు కూడా సభాపతికి అఫిడవిట్ ఇచ్చారు. అఫిడవిట్ ఇచ్చిన వారిలో పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్, బాలరాజులు మినహా అందరూ ఇచ్చారు.

Kiran Kumar Reddy

రాష్ట్రపతికి విజయమ్మ లేఖ

తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు ఇవ్వాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాయనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నేతలు సభాపతిని కలిశారు. గడువు పెంచాలని రాష్ట్రపతిని కోరాలని విజ్ఞప్తి చేశారు.

ఓటింగ్ జరపాలని దూళిపాళ్ల

ముసాయిదా బిల్లుపై ఓటింగ్ జరగాల్సిందేనని తెలుగుదేశం పార్టీ సీమాంద్ర నేత దూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆయన బుధవారం మాట్లాడారు. తెలంగాణ మంత్రులు పోడియంలోకి దూసుకెళ్లి సభను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్దమన్నారు.

ముఖ్యమంత్రి హోదాలోనే కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇచ్చారని స్పీకర్ స్పష్టం చేశారన్నారు. ఓటింగ్‌కు పట్టుబడుతూ తాము అవసరమైతే రాత్రంతా సభలోనే ఉంటామన్నారు. సమైక్యాంధ్ర కోసం పార్టీలకతీతంగా అందరం కలిసి పని చేద్దామని చెప్పారు. అన్ని నోటీసులను స్పీకర్ సభలో పెట్టాలని కోరారు. సిఎం నోటీసును వ్యతిరేకిస్తున్న తెలంగాణ మంత్రులు రాజీనామా చేయాలన్నారు.

ఆందోళనలో మోత్కుపల్లి

ముఖ్యమంత్రి ఇచ్చిన నోటీసును తిరస్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ టిడిపి నేతలు ధర్నాకు కూర్చున్నారు. ఈ ధర్నాలో టిటిడిపి నేతలతో పాటు మోత్కుపల్లి నర్సింహులు బైఠాయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+