తిరుమల లడ్డూలకు నెయ్యి సరఫరా చెయ్యలేము, ఆ టేస్టు ఇక ఉండదు, నాయక్ !
తిరుమల/బెంగళూరు: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) విక్రయిస్తున్న శ్రీవారి లడ్డూలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యి సరఫరా చేసి నష్టాలను భరించే ప్రసక్తే లేదని కర్ణాటక పాల మహామండలి అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు. టీటీడీ తయారు చేస్తున్న లడ్డూలకు నందిని నెయ్యి సరఫరా చేస్తే నష్టాలు వస్తాయని బీమా నాయక్ అంటున్నారు.
బెంగళూరు నగరంలో జరిగిన రాయచూరు, బళ్లారి, కొప్పళ, విజయనగరం జిల్లా సహకార పాల ఉత్పత్తిదారుల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో భీమా నాయక్ పాల్గొన్నారు. తరువాత కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ మీడియాతో మాట్లాడారు. కేఎంఎఫ్ అంటే కర్ణాటక రైతుల సమాఖ్య అని, నష్టాల్లో తిరుమలకు నందిని నెయ్యి సరఫరా చేయడం సాధ్యమేనా? అని మీడియాను ప్రశ్నించారు.

నందిని నెయ్యికి మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉందని, వినియోగదారులు లీటరు నెయ్యిని రూ. 610 ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని, ఇలాంటి సందర్భంలో మేము టీటీడీకి నష్టానికి నందిని నెయ్యిని సరఫరా చేయలేమని, నందిని నెయ్యి పేరుతో కొందరు రాజకీయాలు చేస్తున్నారని పరోక్షంగా బీజేపీ నాయకుల మీద భీమా నాయక్ ఆరోపణలు చేశారు.
కర్ణాటకలో 'సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కర్ణాటక రాష్ట్రాన్ని ఎవరు పాలించారు ?, తిరుమలకు ఎన్ని లీటర్ల నందిని నెయ్యి సరఫరా చేశారు అని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ బీజేపీ నాయకులను ప్రశ్నించారు. కలబురిగి డివిజన్ మినహా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నందిని పాలపొడి సరఫరా అవుతోందని భీమా నాయక్ అన్నారు.
నందిని పాలపొడి ఉత్పత్తి తగ్గడం వల్లే ఈ సమస్య తలెత్తిందని కేఎంఎఫ్ వర్గాలు తెలిపాయి. ఒక కిలో పాలపొడి ఉత్పత్తికి 8 లీటర్ల పాలు అవసరం అవుతోందని, ఒక కిలో 350 రూపాయలు అవుతుందని, కానీ కర్ణాటక ప్రభుత్వం కేఎంఎఫ్ కు కేజీ పాలపొడికి రూ. 300 రూపాయలు మాత్రమే ఇస్తోందని, కాబట్టి పాలపొడి ఉత్పత్తి తగ్గిందని సంబంధిత కేఎంఎఫ్ వర్గాలు తెలిపాయి.

తిరుమల ప్రసాదం రూపంలో పంచే ప్రసిద్ధ తిరుమల లడ్డూలలో మీకు ఇకపై నందిని నెయ్యి ఘమఘలు కనిపించదని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు 50 ఏళ్ల తర్వాత తిరుపతి తిరుమల దేవస్థానం (టీటీడీ) బోర్డు కేఎంఎఫ్ నుంచి నందిని నెయ్యి కొనుగోలును నిలిపివేసిందని, దీంతో లడ్డూల తయారీలో నందిని నెయ్యి వాడకాన్ని టీటీడీ నిలిపివేసిందని భీమా నాయక్ అన్నారు.
ఆగస్టు 1 నుంచి పాల ధర పెరిగినందున సహజంగానే నందిని నెయ్యికి ఎక్కువ డబ్బులు ఇవ్వాలని తాము టీటీడీని డిమాండ్ చేశామని, అయితే లడ్డూల తయారికి నెయ్యి సరఫరా చేసేందుకు టీటీడీ ఈ-ప్రొక్యూర్‌మెంట్ సైట్ ద్వారా తక్కువ ధర కోట్ చేసిన కంపెనీని ఎంపిక చేసింది. నందిని నెయ్యి నాణ్యత కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌ను కలిగి ఉందని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు.

తక్కువ ధరకు బిడ్డింగ్ చేస్తున్న కంపెనీ నెయ్యి నాణ్యత విషయంలో రాజీ పడుతున్నట్లు స్పష్టమవుతోందని, ప్రపంచ ప్రసిద్ధి చెందిన తిరుపతికి వెళ్లిన భక్తులకు టీటీడీ ప్రసాదంగా లడ్డూను పంపిణీ చేస్తోందని.
లడ్డూ అంటే తిరుమల (తిరుపతి), తిరుపతి అంటే లడ్డూ అని ప్రపంచం మొత్తం తెలుసని, ఇంత ఫేమస్ అయిన లడ్డూల తయారీకి నందిని నెయ్యి చాలా కాలంగా వాడుతున్నారని కేఎంఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ అన్నారు.
దీంతో తిరుమల లడ్డు చాలా రుచిగా ఉంటుందని, నందిని నెయ్యితోనే లడ్డులు ఇంత రుచికరంగా ఉంటున్నాయని టీటీడీ స్వయంగా చాలాసార్లు చెప్పిందని, కానీ ఇప్పుడు ధరలో వ్యత్యాసం కారణంగా తిరుపతి లడ్డూలకు నందిని నెయ్యి సరఫరా చెయ్యలేకపోతున్నామని కేఎంఎఫ్ అధ్యక్షుడు భీమా నాయక్ స్పష్టం చేశారు.
-
రూ.300 టికెట్లు లేకపోయినా శ్రీవారి దర్శనం- భక్తుల కోసం టీటీడీ కొత్త విధానం...!! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!!












Click it and Unblock the Notifications