కొడాలి నాని సంచలన కామెంట్స్..ఎన్నికల్లో పోటీ చేయనంటూ
ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. అన్ని రాజకీయ పార్టీలు కూడా ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఇక టికెట్ దక్కిన నేతలు తమ నియోజకవర్గాల్లో విసృతంగా ప్రచారం చేస్తున్నారు. దీనిలో భాగంగానే కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గంలో నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీడీపీ అభ్యర్థి వెనిగళ్ల రాము తన రాజకీయ ప్రత్యర్థి అయిన కొడాలి నానిపై తీవ్ర విమర్శలు చేశారు.
గుడివాడ ప్రజలు నానిని నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని.. అయినా కూడా నియోజకవర్గ ప్రజలకు ఏమీ చేయలేకపోయారని వెనిగళ్ల రాము విమర్శించారు. వెనిగళ్ల రాము తనపై చేసిన విమర్శలకు కొడాలి నాని కౌంటరిస్తూ..గుడివాడలో అర్హులందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామని కొడాలి నాని తెలిపారు. అర్హత ఉండి ఇళ్ల స్థల రాలేదని ఒక్కరు చెప్పిన తాను ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసిరారు.

చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక్క ఎకరం కూడా పేదలకు ఇవ్వలేదని కొడాలి నాని ఎద్దెవా చేశారు. జగన్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొడాలి నాని వ్యాఖ్యనించారు. తాను ఐదోసారి గెలవబోతున్నానని వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని ధీమా వ్యక్తం చేశారు. తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తీసుకువచ్చారని విమర్శించారు.
ఎంత మంది వచ్చినా వైసీపీ తరపున తాను హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు తనపై పోటీకి పెట్టారని... వచ్చే ఎన్నికల్లో అంతరిక్షం నుంచి అభ్యర్థిని తెచ్చుకుంటారని ఎద్దేవా చేశారు. ఏపీలో మళ్లీ వచ్చేది వైసీపీనే అని.. గుడివాడలో మళ్లీ గెలిచేది తానే అని చెప్పారు. జగన్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందని... తాము ప్రజల్లోకి వెళ్లి ఇదే విషయం చెపుతామని అన్నారు.












Click it and Unblock the Notifications