కోదండరాంకు తప్పిన ప్రమాదం: ఢీకొన్న వాహనం
హైదరాబాద్: తెలంగాణ రాజకీయ జెఏసి ఛైర్మన్, ప్రొఫెసర్ కోదండరాం పెద్ద ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. శుక్రవారం మధ్యాహ్నం కోదండరాం ప్రయాణిస్తున్న కారును ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు కీసర సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ ప్రమాదం నుంచి కోదండరాం క్షేమంగా బయటపడ్డారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదని తెలిసింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
అనంతపురం: నగరంలోని కక్కలపల్లి క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆటో, కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. నగరంలోని ఉమానగర్‌కు చెందిన తిమ్మరాజు కక్కలపల్లికాలనీలో ఇల్లు నిర్మించుకుంటున్నాడు. ఆ ఇంటిని చూడటానికి అతని భార్య, పిల్లలు, తల్లి, అత్త కలిసి ఆటోలో వస్తున్నారు.
రోడ్డు కూడలిలో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ కారు వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. దీంతో తిమ్మరాజు తల్లి సావిత్రి(58), అత్త అలివేలమ్మ(61), కుమారుడు (7నెలలు) అక్కడికక్కడే మృతి చెందారు. తిమ్మరాజు భార్య మల్లేశ్వరమ్మ, కుమార్తె దీపిక, ఆటో డ్రైవర్ లక్ష్మీనారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications