తగాదాల వల్లే హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం: కోడెల
తిరుపతి: ఇరు రాష్ట్రాల మధ్య తలెత్తిన వివాదాలను కేంద్ర ప్రభుత్వం అవకాశంగా తీసుకుందని, దాంతోనే హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనం ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకుని చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు తొలగిపోవాలని శ్రీవారిని కోరుకున్నట్లు చెప్పారు.

ఈనెల 18 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయని తెలిపారు. ప్రజాసమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ఒక వేదిక అని కోడెల అన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించామని ఆయన వెల్లడించారు. చంద్రబాబు నేతృత్వంలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా ఉంటుందని ఆయన ఆశించారు.
శనివారం ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు జిఇవో శ్రీనివాస రావు స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఆలయ రంనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.












Click it and Unblock the Notifications