వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మీడియా మెలిక పెట్టింది, అలా చెప్పలేదు: కోడెల

By Pratap
|
Google Oneindia TeluguNews

Kodela shivaprasad rao
హైదరాబాద్: హైదరాబాద్‌లో ఈ బడ్జెట్‌ సమావేశాలే చివరివని తాను చెప్పలేదని, కొన్ని శాఖలను ఇక్కడ నుంచి మారుస్తానని ముఖ్యమంత్రి ప్రకటించారని, అయితే కొన్ని రాష్ట్రాల్లో రెండు చోట్లా అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని, వీటికి మెలికలు పెట్టి మీడియా నేను మాట్లాడని విషయాలు కూడా మాట్లాడానని చెప్పటం మంచి పద్ధతి కాదని, విభజన నేపథ్యంలో మీడియా బాధ్యత పెరిగిందని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద రావు వివరణ ఇచ్చారు.

అసెంబ్లీని తాను దేవాలయంగా భావిస్తానని, అలాంటి సభ కొంత గాడి తప్పడం బాధనిపిస్తున్నదని ఆయన అన్నారు. ఎజెండా పూర్తి కాకపోతే ప్రజలు బాధ పడతారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని పక్షాలూ సహకరించాలని, అప్పుడే సభ సజావుగా నడపడానికి అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. అయితే, సభా మర్యాదలకు భంగం వాటిల్లితే మాత్రం కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మంగళవారంనాడు శానససభ ఆవరణలోని తన ఛాంబర్‌లో మీడియాతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

గత సభ మర్యాదలను, సంప్రదాయాలను పాటించేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు ఆయన చెప్పారు. సభా నాయకుడికి మంగళవారం తగినంత సమయం ఇవ్వలేకపోవడం బాధగా ఉన్నదని అన్నారు. సభలో చర్చ జరగకుండా ఏ అంశాన్నీ గత అసెంబ్లీ సమావేశాల్లో గిలిటెన్‌ చేసేవాళ్లు కాదని ఆయన చెప్పారు. అధికార, ప్రతిపక్షాలు సైతం సమయాన్ని పూర్తిగా వినియోగించుకున్నాయని, ఇప్పుడూ అదే సంప్రదాయంలో సభ జరగాలని కోరుకుంటున్నానని అన్నారు.

విమర్శలు చేయడానికే కాదు.. నిర్మాణాత్మక సూచనలనూ ప్రతిపక్షం ఇవ్వొచ్చునని సూచించారు. అసెంబ్లీ బయట ఎలా ఉన్నా పార్టీలకతీతంగా సభలో అందరికీ సమ న్యాయం చేస్తున్నానని చెప్పారు. సభ వాయిదా పడ్డాక సభ్యుల మధ్య అవాంఛనీయ ఘటన చోటు చేసుకున్నట్టు తెలిసిందని అన్నారు. సభ్యుల మర్యాద, సౌకర్యాలకు తాను పెద్దపీట వేస్తానని చెప్పుకొచ్చారు. సభా గౌరవం నిలిపే విషయంలో మీడియానూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

English summary
Andhra Pradesh assembly speaker Kodela Shivaprasad Rao clarified on his comments and expressed unhappy with media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X