రావాల్సిందే: కెసిఆర్‌ను పరుగు పెట్టించిన కొండా సురేఖ!

కెసిఆర్ బిజీగా ఉండటంతో... సాయంత్రం మూడున్నర గంటలకు తెలంగాణ భవన్‌కు రావాల్సి ఉంది. అయితే, ఆయన ఐదున్నర వరకు రారని తెలిసింది. తనకు బదులుగా ఈటెల రాజేందర్ సమక్షంలో కార్యకర్తలను పార్టీలోకి చేర్పించాలని కొండా దంపతులకు కెసిఆర్ సూచించారు. ఈటెలను పంపించారు.
అయితే, కెసిఆర్ లేకుండా వారి చేరుకకు కొండా దంపతులు అంగీకరించలేదట. కెసిఆర్ వస్తేనే చేర్పిస్తామని వారు భీష్మించుకున్నారట. దీంతో సాయంత్రం ఆరు గంటలకల్లా ఇంటికెళ్లిన కెసిఆర్.. కొండా దంపతుల పట్టుదలతో ఏడు గంటలకల్లా తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఓ దశలో కార్యకర్తలకు క్షమాపణ చెప్పిన ఆయన తనను గుంజుకొచ్చారని వ్యాఖ్యానించారు.
కాగా, టిడిపి అధ్యక్షులు చంద్రబాబు పైన కెసిఆర్ మండిపడ్డారు. చంద్రబాబు కుక్కిన పేను.. విషం కక్కడమే తప్ప.. ఏమీ చెప్పడని ధ్వజమెత్తారు. టిడిపి తెలంగాణ పార్టీ కాదని, అది ఆంధ్రా పార్టీ అన్నారు. చంద్రబాబు తెలంగాణ కోసం పని చేస్తారా? పోలవరం డిజైన్ మార్చాలని చెబుతారా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications