ఏఓబిలో కూంబింగ్ నిలిపివేశాం :డిజిపి

విజయవాడ:ఏఓబిలో కూంబింగ్ ను నిలిపివేశామని ఆంద్రప్రదేశ్ డిజిపి సాంబశివరావు చెప్పారు. మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ లక్ష్యంగా కూంబింగ్ రగలేదన్నారు డిజిపి

మావోయిస్టు అగ్రనేత రామకృష్ణ తమ అదుపులో ఉన్నారని ప్రజాసంఘాలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు.ఏఓబిలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సంచరిస్తున్నారని సమాచారం అందుకొని కూంబింగ్ చేశామన్నారు.ఈ కూంబింగ్ సందర్భ:గా మావోలు తారసపడ్డారని ఆయన చెప్పారు.

koombing stopped :dgp

ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఆధునాతన ఆయుదాలు లభ్యమయ్యాయని, ఘటనను చూస్తే అగ్రనేతలు అక్కడికి వచ్చి ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.తమ అదుపులో మావో అగ్రనేత రామకృష్ణ లేడని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

మావో నేత రామకృష్ణ గురించి సమాచారం తెలియకపోవడంతోనే ప్రజాసంఘాలు తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు.ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతంలో కూంబింగ్ ను నిలిపి వేశామన్నారు డిజిపి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+