కోటంరెడ్డి వర్సస్ ఆదాల : కొత్త ట్విస్టులు - గెలిచేదెవరు..!!
కోటంరెడ్డి వర్సస్ ఆదాల కు నెల్లూరు రూరల్ వ్యక్తిగత ప్రతిష్ఠకు సవాల్ గా మారుతోంది. మరి గెలచేదెవరు.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. కోటంరెడ్డి వర్సస్ ఆదాల కు ఇప్పుడు అక్కడ పోరు వ్యక్తిగత ప్రతిష్ఠకు సవాల్ గా మారుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలతో పార్టీ నుంచి బయటకు వెళ్లిన కోటంరెడ్డి ఇప్పటికీ అవే ఆరోపణలు చేస్తున్నారు. కోటంరెడ్డి మిత్రుడు అసలు తనది ఐ ఫోన్ కాదని చెప్పారు. ట్యాపింగ్ జరగలేదని..రికార్డింగ్ చేసానని వెల్లడించారు. దీని పైన స్పందించిన కోటంరెడ్డి తన స్నేహితుడికి స్క్రిప్టు సరిగ్గా ఇవ్వలేదని వ్యాఖ్యానించారు. ఇక..ఇప్పుడు కొత్త ఇంఛార్జ్ ఆదాల - మంత్రి కాకాని ఇద్దరూ నియోజకవర్గంలో మకాం వేసారు. పార్టీ నేతలందరినీ ఒకే వేదిక మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కోటంరెడ్డి -ఆదాల పోరు రోజుకో మలుపు తిరుగుతోంది.

ఆరు నెలల్లో చిత్ర విచిత్రాలు
కోటంరెడ్డి స్నేహితుడు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని క్లారిటీ ఇచ్చారు. దీని పైన కోటంరెడ్డి స్పందించారు. తన స్నేహితుడితో ఇలా చెప్పిస్తారని తాను ముందే చెప్పిన విషయాన్ని గుర్తు చేసారు. విచారణకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావటం లేదని ప్రశ్నించారు. విచారణ చేస్తే మిగిలిన వారి ట్యాపింగ్ బయట పడుతుందని చెప్పుకొచ్చారు. మంత్రులు..ఎంపీలు..ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయంటూ మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్ ఇస్తే వెళ్లి కలిసి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. తన మిత్రుడు తనది ఐ ఫోన్ అయినా..ఆండ్రాయిడ్ ఫోన్ గా చెబుతున్నారని.. ఆయనతో చెప్పించే సమయంలో ప్రభుత్వంలోని ముఖ్యులు స్క్రిప్టు సరిగ్గా ఇవ్వలేకపోయారంటూ వ్యాఖ్యానించారు. ఆరు నెలల తరువాత రాజకీయంగా చిత్ర విచిత్రాలు చూస్తారంటూ ఆసక్తి పెంచే ప్రయత్నం చేసారు.

కోటంరెడ్డి ని చంద్రబాబు ట్యాప్ చేసారు
కోటంరెడ్డి చేసిన ఆరోపణలు నిజం కాదని తేలిపోయాయని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. కోటంరెడ్డి పార్టీ వీడారని..ఆయన రాజకీయం ఆయన చేసుకుంటే తమకు ఇబ్బంది లేదన్నారు. మీడియాలో ప్రచారం కోసం రోజు తమ పార్టీని...ప్రభుత్వాన్ని విమర్శిస్తే సహించేది లేదన్నారు. కోటంరెడ్డికి మద్దతుగా ఉన్న కార్పోరేటర్లు తిరిగి పార్టీలోనే కొనసాగేందుకు అంగీకరించారు. వైసీపీలోనే పని చేస్తామని వారంతా చెప్పారని మంత్రి వెల్లడించారు. అదే సమయంలో ఆదాల నియోజకవర్గంలోని ప్రతీ మండలంలో ఆత్మీయ సమావేశాలకు సిద్దమయ్యారు. పార్టీకి చెందిన ప్రతీ గ్రామంలోని కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. వరుస సమావేశాలు నిర్వహిస్తూ.. కేడర్‌ను ఏకతాటి పైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. వైసీపీ కేడర్ కోటంరెడ్డికి మద్దతుగా నిలబడకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.













Click it and Unblock the Notifications