పవన్ వారాహి వెంట బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరణ-కృష్ణా ఎస్పీ హెచ్చరిక-జనసైనికుల ఫైర్..
పవన్ కళ్యాణ్ వారాహి వాహనం వెనుక భారీ ఎత్తున బైక్ లతో మచిలీపట్నాకి ర్యాలీగా వెళ్లాలన్న జనసేన క్యాడర్ ఆశలపై కృష్ణాజిల్లా పోలీసులు గండికొడుతున్నారు.
మచిలీపట్నం : జనసేన పార్టీ పదో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ కృష్ణాజిల్లా కేంద్రం మచిలీపట్నంలో పార్టీ భారీ సభ నిర్వహించబోతోంది. జనసేన పార్టీ ఏర్పాటై పదేళ్లు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సభ ఎన్నికలకు ఏడాది మాత్రమే ఉన్న తరుణంలో పవన్ కళ్యాణ్ కు ఈ సభ కీలకంగా మారింది.
అయితే బందరులో జనసేన సభ నిర్వహణకు ముందు విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంపై భారీ ర్యాలీగా మచిలీపట్నానికి వెళ్లేందుకు పవన్ సిద్ధమయ్యారు. ఆయన వారాహి వాహనంపై వెళుతుంటే వెనుక భారీ బైక్ ర్యాలీగా తాము కూడా వెళ్లేందుకు జనసేన క్యాడర్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెనుక వెళ్లే క్యాడర్ కు పోలీసులు షాకిచ్చారు. పవన్ వారాహి వాహనం వెనుక బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వబోమని కృష్ణాజిల్లా పోలీసులు తేల్చిచెప్పేశారు.

బందరులో జనసేన పార్టీ ఆవిర్బావ సభ, ఇతర కార్యక్రమాల నేపథ్యంలో కృష్ణా జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ జాషువా ప్రకటించారు. కాబట్టి ఎలాంటి ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఒకవేళ పోలీసు ఆంక్షలు ఉల్లంఘంచి ర్యాలీ చేపడితే మాత్రం పోలీసు యాక్ట్ ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. గతంలో వైసీపీ ఆవిర్బావ సభకు భారీ ర్యాలీల్ని అనుమతించి ఇప్పుడు జనసేనకు ఆంక్షలు పెడతారా అని ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications