రూ.294.20 కోట్లతో రిటైనింగ్ వాల్.. మాట నిలబెట్టుకుంటున్న మంత్రి లోకేష్
తాడేపల్లి మహానాడు ప్రాంత ప్రజలతో దశాబ్దాల కల నిజం చేయడానికి ఏపీ మంత్రి నారా లోకేష్ నడుంబిగించారు. ఎన్నికలకు ముందు తన ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి శ్రీకారం చుట్టిన ఆయన కృష్ణానది కుడివైపున ప్రకాశం బ్యారేజ్ దిగువన రిటైనింగ్ వాల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.నగరంలోని మహానాడు వద్ద 294.20 కోట్లతో నిర్మించనున్న ఈ గోడ తన ఎన్నికల హామీల నెరవేరుస్తుందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.
కృష్ణానది కుడివైపున ప్రకాశం బ్యారేజ్ దిగువన రక్షణ గోడ
0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు ఈ రక్షణ గోడ నిర్మాణం జరగనుంది. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణం పైన ఫోకస్ చేసిన మంత్రి లోకేష్ ఈ ప్రాజెక్టుకు ఏడాది వ్యవధిలోనే పరిపాలన అనుమతులు, టెండర్ ప్రక్రియలను పూర్తి చేయించి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ లోకేష్ ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణాన్ని చేయిస్తున్నారు.

వరదలను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన భారీ రిటైనింగ్ వాల్
భవిష్యత్తులో భారీ వరదలను దృష్టిలో పెట్టుకుని పటిష్టమైన ప్రణాళికతో, 15 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని తట్టుకునేలా పటిష్టమైన డిజైన్ తో ఈ రిటైనింగ్ వాల్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ రిటైనింగ్ వాల్ భూమి లోపల 26 మీటర్ల నుండి 38 మీటర్ల లోతు వరకు 1920 పైల్స్ వేసి, ఫైల్ రాప్ట్ సాంకేతికతతో భూకంపాలను, నీటి ఉధృతిని ఎదుర్కొనే లాగా నిర్మిస్తున్నారు.
జాతీయ రహదారి-65కు ఇది రక్షణగా వాల్
ఈ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి కావడం వలన సుందరయ్య నగర్, మహానాడు కాలనీ వంటి లోతట్టు ప్రాంతాల్లో నివసించే దాదాపు 50వేల మంది ప్రజలు వరద భయం నుంచి శాశ్వతంగా విముక్తి పొందుతారు. అంతేకాకుండా, అమరావతి రాజధాని పరిధిలోని కీలక ప్రాంతాలకు, జాతీయ రహదారి-65కు ఇది రక్షణగా నిలుస్తుంది.
రిటైనింగ్ వాల్ నిర్మాణ నిర్ణయంతో సంతోషం
మొత్తంగా మంత్రి నారా లోకేష్ రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం తీసుకున్న ఈ నిర్ణయం అక్కడ వారి సంతోషానికి కారణం అవుతుంది. ఈ రక్షణ వాల్ నిర్మాణం జరిగితే ప్రకాశం బ్యారేజ్ వరదల భయం అక్కడ ప్రజలకు లేకుండా ఉంటుంది.












Click it and Unblock the Notifications