గుప్త నిధుల కోసం దారుణం- గుంటూరులో రాయల నాటి గణేశ్ విగ్రహం కూల్చివేత...
గుంటూరు : గుప్త నిధులు దొరుతుతాయో లేదో తెలియదు కానీ వాటి కోసం ఈ కాలంలో జరుగుతున్న దారుణాలు అన్నీ ఇన్నీ కావు. ముఖ్యంగా వీటి కోసం తమ సొంత ఇల్లు తవ్వుకుంటున్నవారు కొందరైతే, రాళ్లు రప్పలు, గుట్టలు తవ్వేస్తున్న వారు మరికొందరు. ఇదే క్రమంలో ఏపీలోని గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఏకంగా చారిత్రక వినాయకుడి విగ్రహం పొట్టను పగులగొట్టిన దారుణ ఘటన చోటు చేసుకుంది.
గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఉన్న కృష్ణదేవరాయల కాలం నాటి ఓ పురాతన వినాయకుడి విగ్రహాన్ని ఆగంతకులు నిన్న రాత్రి ధ్వంసం చేశారు. గణేశ్ విగ్రహం పొట్టను పగులగొట్టి గుప్త నిధుల కోసం వెతికారు. అవి దొరక్కపోయే సరికి అక్కడి నుంచి వారు ఉడాయించినట్లు తెలుస్తోంది. ఇలా విగ్రహం పగులగొడితే గుప్త నిధులు దొరుకుతాయని ఎవరు చెప్పారో తెలియదు కానీ దుండగులు మాత్రం పురాతన విగ్రహాన్ని ఇలా పగులకొట్టేశారు.

గుప్త నిధుల కోసం ఫిరంగిపురంలో గణేశ్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశాన్ని వీడియోతో సహా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. ఫిరంగిపురంలోని వినాయకుడి గుడిలో విగ్రహాన్ని ఇలా ధ్వంసం చేశారంటూ విష్ణు తెలిపారు. గతంలోనూ ఇలాంటి పలు ఘటనలు జరిగాయని, కానీ వైసీపీ సర్కార్ చర్యలు తీసుకోలేదన్నారు. దీంతో ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటన జరిగిందన్నారు. వినాయకుడి విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ను, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు.
Vinayak ji's idol destroyed in ancient Ganapati temple in Firangipuram, Guntur.
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) April 4, 2023
In past also several incidents of this sort happened but no actions were taken by @YSRCParty gvt & its now repeated again.
I demand strict actions against culprits @AndhraPradeshCM @dgpapofficial! pic.twitter.com/tZM3gNeig9
-
వాస్తు అనేది నిజమేనా? ఎందుకు దాన్ని ఫాలో అవ్వాలి? -
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..?











Click it and Unblock the Notifications