సైబర్ ఫోరెన్సిక్ సెంటర్ ప్రారంభించిన కెటిఆర్(పిక్చర్స్)
హైదరాబాద్: ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. సోమవారం కొండాపూర్ లక్ష్మీ సైబర్ సిటీ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఈవై సైబర్ ఫోరెన్సిక్ అండ్ ఈ-డిస్కవరీ సెంటర్'ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సురక్షితమైన టెక్నాలజీ నగరంగా హైదరాబాద్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ సెల్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. అతిపెద్ద ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఈవై కంపెనీ హైదరాబాద్‌లో ప్రారంభించడం అభినందనీయమని కెటిఆర్ అన్నారు.
130 మందితో నగరంలో ప్రారంభమైన ఈ కంపెనీ, మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఈ ల్యాబ్‌ను సందర్శించి నేరాల నియంత్రణకు అవసరమైన ఆధునిక పరిజ్ఞానం తెలుసుకోవాల్సిందిగా సూచిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఈవై కంపెనీ ఫోరెన్సిక్ టెక్నాలజీ అండ్ డిస్కవరీ సర్వీసెస్ విభాగం లీడర్ పాల్ వాల్కర్ పాల్గొన్నారు.

కెటిఆర్
ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సైబర్ నేరాలను అరికట్టాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.

కెటిఆర్
సోమవారం కొండాపూర్ లక్ష్మీ సైబర్ సిటీ భవనంలో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఈవై సైబర్ ఫోరెన్సిక్ అండ్ ఈ-డిస్కవరీ సెంటర్'ను ఆయన ప్రారంభించారు.

కెటిఆర్
ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ.. సురక్షితమైన టెక్నాలజీ నగరంగా హైదరాబాద్‌ను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

కెటిఆర్
పోలీసు శాఖలోని సైబర్ క్రైమ్ సెల్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు కృషి చేస్తామని కెటిఆర్ చెప్పారు.

కెటిఆర్
అతిపెద్ద ఫోరెన్సిక్ ల్యాబ్‌ను ఈవై కంపెనీ హైదరాబాద్‌లో ప్రారంభించడం అభినందనీయమని కెటిఆర్ అన్నారు. 130 మందితో నగరంలో ప్రారంభమైన ఈ కంపెనీ, మరింత వృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఈవై కంపెనీ ఫోరెన్సిక్ టెక్నాలజీ అండ్ డిస్కవరీ సర్వీసెస్ విభాగం లీడర్ పాల్ వాల్కర్ పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications