జగన్ నన్ను ఓడించడానికి డబ్బులు పంపించారంటూ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఏపీ సీఎం జగన్ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో జగన్ తనని ఓడించడానికి డబ్బులు పంపించారని మంత్రి కేటీఆర్ చెప్పడం సంచలనంగా మారింది. ఓ ప్రముఖ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్య్వూలో కేటీఆర్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2010లో తెలంగాణ ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్లానని మంత్రి కేటీఆర్ తెలిపారు.

ఆ ఎన్నికల్లో గెలుపు నాకు ప్రతిష్టాత్మకంగా మారిందని..ఆ సమయంలో కేసీఆర్ కొడుకును అంటే నన్ను ఓడించడానికి జగన్ భారీగా డబ్బులు పంపించారని నా మనిషి ఒకరు తనతో చెప్పారని కేటీఆర్ తెలిపారు. అయితే ఆ సమయంలో జగన్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారని కేటీఆర్ తెలపడం జరిగింది.

దాంతో హుటాహూటిన ఘటన స్థలానికి తన మనుషులతో అక్కడికి వెళ్లగా..కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ వ్యక్తి అక్కడ డబ్బులు పంచుతున్నారని..అటు నుంచి డబ్బులు తీసుకుని వస్తున్న మహిళలను ఓటుకు డబ్బులు తీసుకున్నారా అని ప్రశ్నించగా.. మొదట ఇద్దరు , ముగ్గురు లేదని చెప్పారని..కాని తరువాత ఓ మహిళను అడగ్గా.. తీసుకున్నాం అన్న అని బదులిచ్చిందని కేటీఆర్ తెలిపారు.

ఎంతచ్చారని అడగ్గా.. ఓటుకు 600 రూపాయిలు ఇచ్చారని సమాధానం వచ్చిందని..మరి ఓటు ఎవరికి వేస్తావని ప్రశ్నించగా..వాళ్ల దగ్గర డబ్బులు తీసుకున్నా .. ఓటు మాత్రం మీకే వేస్తానన్న అంటూ సదరు మహిళ సమాధానం ఇచ్చిందని.. కేటీఆర్ చెప్పుకొచ్చారు. సిరిసిల్ల ప్రజలకు నాపై అపారమైన నమ్మకం ఉందని .. నేను మీకు పనికి వస్తాను అనుకుంటేనే తనకు ఓటు వేయమని అప్పుడు ప్రజలను ఆడిగానని..ఇప్పుడు అదే నిజం అయిందని కేటీఆర్ వెల్లడించారు. అయితే తనని ఓడించడానికి జగన్ డబ్బులు పంపించారనే దానిపై మంత్రి కేటీఆర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications