వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సుప్రీంకు వెళ్తాం: సిగ్గుచేటు అని మోడీపై కెటిఆర్ వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/ కరీంనగర్ : ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై సర్వ అధికారాలను గవర్నర్‌కు అప్పగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం సరికాదని తెలంగాణ ఐటి, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కెటి రామారావు అన్నారు.

సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ చర్య సిగ్గుచేటు అని ఆయన శనివారం ఉదయం మీడియా వద్ద వ్యాఖ్యానించారు. శాంతిభద్రతలు రాష్ట్రం పరిధిలోనే ఉండాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కేంద్రం నిర్ణయం వెనుక కొంతమంది పెట్టుబడిదారుల హస్తం ఉందని ఆయన ఆరోపించారు. గవర్నర్‌కు అధికారాలపై సుప్రీం కోర్టుకు వెళ్లనున్నట్లు చెప్పారు. మొదటి నుంచి తెలంగాణపై కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇలాగే వెళితే యుద్ధం తప్పదని మంత్రి కెటిఆర్ హెచ్చరించారు.

KTR says will not accept powers to governor

హైదరాబాద్‌లో అధికారాలు గవర్నర్‌కు అప్పగిస్తే ఒప్పుకునేది లేదని తెలంగాణ మంత్రి జోగురామన్న స్పష్టం చేశారు. చంద్రబాబు చేతిలో ప్రధాని నరేంద్ర మోడీకీలుబొమ్మలా మారారని శనివారం ఉదయం కరీంనగర్ జిల్లాలో మీడియా సమావేశంలో విమర్శించారు.

పరిశ్రమల కోసం అటవీభూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, అటవీశాఖలో 42 శాతం ఉద్యోగాలు త్వరలో భర్తీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈనెల 19న సర్వేకు ప్రజలంతా సహకరించాలని మంత్రి జోగురామన్న కోరారు.

English summary
Telangana IT and Panchatraj minister KT Rama Rao said that imposing governor powers will be challenged in Supreme court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X