Kumari aunty: ఇప్పుడు టీడీపీ స్టార్ క్యాంపెయినర్ గా కుమారి ఆంటీ?.. ఎందుకంటే!!
ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న పేరు కుమారి ఆంటీ. గత పది సంవత్సరాలుగా దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి సమీపంలో ఉన్న ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్న రోడ్లో ఫుట్ పాత్ మీద భోజనం అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ తన ఫుడ్ బిజినెస్ ద్వారా ఇటీవల యూట్యూబ్లో బాగా ఫేమస్ అయ్యారు.
Recommended Video

ఇక కుమారి ఆంటీని ఇంటర్వ్యూ చేసిన ఒక youtube ఛానల్లో కుమారి ఆంటీ తనకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇల్లు ఉందని చెప్పడంతో వైసిపి సోషల్ మీడియా ఈ వీడియోను వైసిపి అనుకూల ప్రచారానికి వాడేసుకుని సోషల్ మీడియాలో రచ్చ చేసింది. దీంతో కుమారి ఆంటీ పై రాజకీయం మొదలైంది. ఇక తాజాగా మరో వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

తనకు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చి మేలు చేశారని ఇంటర్వ్యూలో చెప్పిన కుమారి ఆంటీ తాజాగా మరో యూట్యూబ్ ఛానల్ వారు అసలు మీరు అభిమానించే పార్టీ ఏది అని అడిగిన ప్రశ్నకు మరో ఆసక్తికర సమాధానం చెప్పింది. తనకు ఓటు హక్కు వచ్చినప్పటినుంచి చంద్రబాబుకే తన ఓటు వేశానని కుమారి ఆంటీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆవిడ క్లియర్ గానే ఉంది.... వీళ్ళకే చాలా సస్పెన్స్ తరువాత అర్ధమయ్యింది...
— KUPPAM—TDP (@KuppamTdp) January 31, 2024
ఇప్పుడు పేటీఎంలలో ముఖచిత్రాలు ఏంటో 🤣#KumariAunty pic.twitter.com/U7OtFEkG90
టిడిపి శ్రేణులు ఎక్స్ వేదికగా దీన్ని ట్రెండింగ్ చేస్తున్నారు. కుమారి ఆంటీ జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇచ్చారని చెప్పిన వీడియోను వైసిపి ప్రచారం చేస్తుంటే, కుమారి ఆంటీ టిడిపి అభిమాని అని, ఆమె తన ఓటును తెలుగుదేశం పార్టీకే వేసిందని ఆమెనే స్వయంగా చెప్పిన వీడియోను టిడిపి శ్రేణులు ట్రెండ్ చేస్తున్నారు.
మొత్తంగా కుమారి ఆంటీ ప్రస్తుత ఏపీ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో ఒకసారిగా ఫేమస్ అయిన కుమారి ఆంటీ ని తమ స్టార్ క్యాంపెయినర్ గా మార్చుకునే పనిలో బిజీగా ఉన్నారు ఏపీలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టీడీపీలు.ఇక కుమారి ఆంటీ వ్యవహారం ఏపీ రాజకీయాలలో ఎందాకా వెళుతుందో చూడాల్సిందే.












Click it and Unblock the Notifications