చంద్రబాబు, పవన్ పై పోస్టులు అక్కడి నుంచే-తేల్చేసిన కర్నూలు డీఐజీ ..!
గత ఐదేళ్లలో వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం అప్పటి విపక్ష నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, వారి కుటుంబాల్ని టార్గెట్ చేస్తూ ఎక్కడి నుంచి పోస్టులు పెట్టిందో తేలిపోయింది. ఈ మేరకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్టును చూపిస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కీలక వివరాలు వెల్లడించారు. అంతే కాదు ఇలాంటి పోస్టులపై విదేశాల్లో అయితే ఉరిశిక్షలు అమలవుతున్నాయని ఆయన తెలిపారు.
సోషల్ మీడియా సైకోలపై ప్రభుత్వ యుద్ధంలో భాగంగా వర్రా రవీందర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిని అరెస్టు చేసినట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. తెలుగు ఛానళ్లు చూడక పోవడంతో సోషల్ మీడియాపై అవగాహన లోపించిందన్నారు.
గల్ఫ్ దేశాల్లో ఇల్లాంటి సంఘటన జరిగితే రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేస్తారన్నారు. కూటమి నేతలపై సోషల్ మీడియాలో అసభ్యంగా పోస్టులు పెట్టడమే ప్రధాన ధ్యేయమన్నారు. సోషల్ మీడియాలో వీరు వికృత విలాపాలు చేసారన్నారు. ఇదంతా ఒక టీమ్ ద్వారా జరిగిందన్నారు.

వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు ఈ నెల ఐదవ తేదీన పట్టుకున్నా అతను పారిపోయాడని కోయ ప్రవీణ్ తెలిపారు. ఎనిమిదో తేదీ పట్టుకోవడానికి ప్రయత్నం చేశామని, నిన్న మార్కాపురం లో 11 గంటలకు అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.
వర్రాకు 38 సంవత్సరాలు అని, వేములలోని భారతి సిమెంట్స్ లో 2012లో ఉద్యోగి అని తెలిపారు. ఏపీ డిజిటల్ కార్పొరేషన్ వాసుదేవ రెడ్డి ద్వారా 65 మంది ఉద్యోగులు ఇలా వైసీపీ సోషల్ మీడియాకు పనిచేసినట్లు వెల్లడించారు. 2020 లో సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాలో అరంగేట్రం చేశారన్నారు.
మూడు రాజధానులపై వ్యతిరేకత, జడ్జీలపై వ్యతిరేక పోస్టులు, రాష్ట్ర స్థాయి నాయకుల కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ అసభ్యకర పోస్టులు చేశారన్నారు. వీటిపై పలు రకాలైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో జాయిన్ అయినప్పటి నుంచి అసభ్యకర పోస్టులు పెరిగాయన్నారు. అవినాష్ పిఏ రాఘవ ద్వారా వర్రాకి కంటెంట్ అందేదని తెలిపారు. షర్మిల, సునీత మీద అసభ్యకర పోస్టులు అవినాష్ మాట్లాడుతుండగా .. పిఏ రాఘవ రాసుకొని వర్రాకి కంటెంట్ అందుతోందని వాంగ్మూలంలో చెప్పాడన్నారు.












Click it and Unblock the Notifications