దుర్గగుడి లడ్డూ ప్రసాదంలో పురుగులు
విజయవాడ: విజయవాడ దుర్గ గుడి ప్రసాదంలో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాదం లడ్డూలో పురుగులు బయటపడటంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దుర్గ గుడి అధికారులు నిర్లక్ష్యం వల్ల లడ్డూ, పులిహోర తదితర ప్రసాదాల తయారీ తీరుపై భక్తుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. దీంతో భక్తులు తరలి వస్తున్నారు. అందుకు అవసరమైన లడ్డూలను తయారు చేయగా సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో వాటిపై పురుగులు పడ్డాయి. 50 లడ్డూలు వృథా అయ్యాయి.












Click it and Unblock the Notifications