పెళ్ళి చూపులకు వెళ్తోన్న టెక్కీపై వేధింపులు, రైలు నుండి దూకేసింది
పెళ్ళి చూపులకు వెళ్తోన్న ఇంటికి టెక్కీకి వేధింపులువేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైళ్ళో నుండి దూకిందిప్రకాశం జిల్లా సింగరాయకొండ వద్ద ఘటన చోటుచేసుకొంది.
ఒంగోలు: విజయవాడకు చెందిన ఓ మహిళ టెక్కీ పెళ్ళిచూపుల కోసం చెన్నై నుండి మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా దారుణంగా చోటుచేసుకొంది. రైలులో తన స్నేహితులతో కలిసి ప్రయాణిస్తున్న యువతిని ముగ్గురు పోకీరీలు వేధించారు.దీంతో బాధితురాలు రైలు నుండి దూకేసింది.
ఈ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు ప్రకాశం జిల్లా సింగరాయకొండ సమీపంలో రైలు నెమ్మదిగా వెళ్తోన్న సమయంలో ఆ యువతి రైలులో నుండి దూకింది. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని విజయవాడకు తరలించారు.

చెన్నైలోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఓ యువతి పనిచేస్తోంది. పెళ్ళి చూపుల కోసం ఆమె తన స్నేహితులతో కలిసి తన స్వంత ఊరు విజయవాడకు మిలీనియం ఎక్స్‌ప్రెస్‌లో వస్తుండగా ముగ్గురు యువకులు ఆమెను తీవ్రంగా వేధించారు. ఈ వేధింపులు తట్టుకోలేక బాధితురాలు రైలు నుండి దూకింది.
తీవ్రగాయాల పాలయిన ఆమెను రైల్వే సిబ్బంది ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలను చేపట్టారు.












Click it and Unblock the Notifications