బాబా రామ్‌దేవ్ వచ్చినా భూమి ఇస్తాం: గంటా
విజయవాడ/ హైదరాబాద్: ఈషా ఫౌండేషన్ కోసం ఇవ్వబోయే భూములు యోగా, ధ్యాన కేంద్రాల కోసంకాదని, ప్రపంచస్థాయి సంస్థల కోసం ఇచ్చామని, విశాఖలో బ్రహ్మకుమారీలకు కూడా భూములిచ్చామని, ఒకవేళ రా మ్‌దేవ్‌బాబా వచ్చినా భూములిస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి గంటా శ్రీనివాసరావు విజయవాడలో తెలిపారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం గల వారితో సీఎం ఒక కమిటీ వేశారని, నివేదిక ఆధారంగానే ఎవరికైనా భూములు కేటాయిస్తామన్నారు.
జగ్గీవాసుదేవ్‌కు చెందిన ఈషా ఫౌండేషన్‌కు భూ కేటాయింపు చేసే యోచనలో ఉన్నామని, అయితే అవి అటవీ ప్రాంతంలో ఉండటం వల్ల కేంద్రం నుంచి అనుమతులు రావాలని, ఈ భూములు డీనోటిఫై చేసిన తర్వాతనే ఈషా ఫౌండేషన్‌కు చెందుతుందని తెలిపారు. ఏదిఏమైనా నిబంధనలకు అనుగుణంగానే భూకేటాయింపులు ఉంటాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి భూమి విలువ తెలుసన్నారు.

రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో అంధత్వాన్ని పూర్తిగా నివారించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. ఇందులో భా గంగా ఎప్పటికప్పుడు విద్యార్ధులకు నేత్రపరీక్షలు నిర్వహించాలని సూచించారు.
గిరిజనప్రాంతాల్లో ప్రతి వారం నేత్ర పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. గురువారం సచివాలయంలో జరిగిన ‘రైట్ టు సైట్ సొసైటీ' సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో నేత్ర నిధిని ఏర్పాటు చేయడంతోపాటు డయాబెటిక్ రేటినోపతి సెంటర్స్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్












Click it and Unblock the Notifications