ల్యాప్‌టాప్‌లు మాయం చేసేది ఇతడే:11ఏళ్లుగా అదే పని

Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: ఎట్టకేలకు ల్యాప్‌టాప్‌ల దొంగ పోలీసులకు చిక్కాడు. ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ ల్యాప్‌టాప్‌ల చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ రియాజుద్దీన్‌ను పంజాగుట్ట పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్లు ఈ మేరకు వివరాలను వెల్లడించారు.

నిందితుడు హైదరాబాద్‌, గుంటూరు జిల్లాల్లో 11 కేసుల్లో ముద్దాయిగా ఉన్నట్లు తెలిపారు. నిందితుడి నుంచి 14 ల్యాప్‌టాప్‌లు, 16 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 2005 నుంచి రియాజుద్దీన్‌ గుంటూరు జిల్లాల్లో చోరీలకు పాల్పడుతున్నాడు. కాగా, ఇటీవలే హైదరాబాద్‌కు వచ్చి క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.

Laptop thief arrested in Hyderabad

ఎస్సార్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటూ విద్యార్థులు, ఉద్యోగుల గదుల్లోకి రాత్రి సమయాల్లో ప్రవేశించి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లు దొంగిలిస్తున్నాడు. ఈ మేరకు బాధితుల నుంచి ఫిర్యాదులు అందుకున్న పోలీసులు నిఘా పెట్టి అతడ్ని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ నగరంలోని పంజాగుట్ట, సరూర్‌నగర్‌, ఎస్సార్‌నగర్‌, నారాయణగూడతో పాటు గుంటూరు, నర్సరావుపేట ప్రాంతాల్లో ఇతడు చోరీలకు పాల్పడినట్లు పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Laptop thief arrested in Hyderabad on Thursday.
Please Wait while comments are loading...