అతి మంచోళ్లు: లక్ష్మీపార్వతి, టిపై అద్వానీ కీలక వ్యాఖ్య

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద జరిగిన మహాధర్నాలో లక్ష్మీ పార్వతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలుగు వాళ్లు తెలివి తక్కువ వాళ్లు కాదని, అతి మంచివాళ్లని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెసు కుట్రలు చేస్తోందన్నారు.
తెలుగు జాతి మధ్య చిచ్చు పెట్టారని నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కాంగ్రెసు పార్టీ కంకణం కట్టుకుందన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తర్వాత తెలుగు జాతి ఐక్యత కోసం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే పాటుపడుతున్నారని కితాబిచ్చారు. జగన్ వల్లనే తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడుతోందన్నారు.
కాగా, తెలంగాణకు తాము కట్టుబడి ఉన్నామని అయితే తెలంగాణ పేరుతో సీమాంధ్రులకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోమని బిజెపి అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ జైరామ్ రమేష్‌కు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి జైరాం రమేష్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ అద్వానీ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ పేరుతో సీమాంధ్రకు అన్యాయం జరిగితే ఒప్పుకోమని, ఇరు ప్రాంతాలకు న్యాయం జరగాలన్నారు.












Click it and Unblock the Notifications