సబ్ జైలులో వైయస్సార్ కాంగ్రెస్ లీడర్, కార్యకర్తల హడావుడి

దర్శి: పర్చూరు నియోజవకర్గ ఇంచార్జ్ గొట్టిపాటి భరత్‌ను శుక్రవారం రాత్రి దర్శి సబ్ జైలుకు తరలించారు. మార్టూరు మండలం నాగరాజుపల్లికి చెందిన అనిల్‌ పైన దాడి చేసిన కేసులో నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ మార్టూరు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను దిగ్బంధం చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని పోలీసులు కేసు నమోదు చేసి అద్దంకి కోర్టులో హాజరుపరిచారు. మెజిస్ట్రేట్ శుక్రవారం రాత్రి భరత్‌కు రిమాండ్‌ విధించారు. అతనిని దర్శి సబ్‌ జైలుకు తరలించారు.

Leaders meeting with YSRCP leader in Sub Jail

గొట్టిపాటి భరత్ దర్శి సబ్ జైలులో ఉన్నారన్న విషయం తెలుసుకున్న పర్చూరు, మార్టూరు ప్రాంతాల వైయస్సార్ కాంగ్రెస్ పార్ట నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. సబ్ జైలు వద్ద కాసేపు హడావుడి కనిపించింది. సబ్‌ జైలులో ఉన్న గొట్టిపాటి భరత్‌ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. ఆయన వెంట పలువురు నాయకులు ఉన్నారు.

అంతకుముందు మార్టూరులో శుక్రవారం సాయంత్రం జాతీయ రహదారిపై రెండు గంటల పాటు రాస్తారోకో చేయడంతో పాటు, భరత్‌ ఆర్టీసీ బస్సు కింద దూరడంతో హైడ్రామా నడిచింది. ఈ సంఘటనకు సంబంధించి మార్టూరు పోలీసులు 143, 353, 341, 7(1), 149 సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి అద్దంకి కోర్టులో హా జరుపరిచారు. భరత్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+