భాగస్వామిగా ఉన్న ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో!?
హైదరాబాద్: లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో కిరణ్ కుమార్ రెడ్డికి వాటాలున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు చెప్పిన విషయం తెలిసిందే. అయితే, ఆయన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డియా లేక మరో కిరణ్ కుమార్ రెడ్డియా అని చెప్పలేదు. సోమవారం మంత్రివర్గం సమావేశమైన అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
అనంతపురం జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన భూములను ఆ కంపెనీ నుండి వెనక్కి తీసుకోవాలని మంత్రివర్గ సంఘం ఏపీ ప్రభుత్వాన్ని కోరింది.

ఈ నేపథ్యంలో అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. బాలీజీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీకి కూడా లేపాక్షితో సంబంధం ఉందని, అందులో కిరణ్ కుమార్ రెడ్డి ఒక భాగస్వామిగా ఉన్నారని తేలిందని తెలిపారు. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరో తెలియడం లేదని, ఆయన పేరు మీద షేర్లు మాత్రం ఉన్నాయని చెప్పారు.
ఇందుకు సంబంధించిన నిర్ణయాలు సీఎం కార్యాలయం నుండే జరిగాయన్నారు. ఉపసంఘం రెండో సమావేశంలో నాలెడ్జ్ హబ్ పైన చర్చించామన్నారు. ఈ నెల 10వ తేదీన జరిగే మూడో విడత సమావేశంలో కృష్ణపట్నం ఇన్‌ఫ్రాటెక్ సెజ్ పైన చర్చిస్తామన్నారు. ఊ భూమిపై రూ.1150 కోట్ల రుణం తీసుకున్నారన్నారు.












Click it and Unblock the Notifications