కాపు రిజర్వేషన్లకు లైన్ క్లియర్-కేంద్రం కీలక ప్రకటన-వైసీపీ ప్రభుత్వానికి మరో సవాల్
ఏపీలో కాపులు ఎన్నాళ్లుగానే ఎదురుచూస్తున్న రిజర్వేషన్ల విషయంలో కేంద్రం ఇవాళ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో కాపు రిజర్వేషన్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం కావాలంటూ ఇప్పటివరకూ రాజకీయ పార్టీలు చేస్తున్న వాదనపై పార్లమెంటులోనే క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు న్యాయశాఖమంత్రి ఇచ్చిన సమాధానంతో కాపు రిజర్వేషన్లకు అడ్డంకులు తొలగినట్లయింది. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి కొత్త సవాల్ ఎదురుకానుంది.

కాపు రిజర్వేషన్ల డిమాండ్
ఏపీలో సామాజికంగా వెనుకబడిన కాపు సామాజిక వర్గానికి ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే దీనికి గతంలో కాంగ్రెస్, టీడీపీలు హామీ ఇచ్చినా అమలు మాత్రం కాలేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కాపు రిజర్వేషన్లకు చంద్రబాబు ఇచ్చిన హామీని అమలు చేసే క్రమంలో కేంద్రం ఈబీసీలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లలో ఐదుశాతం కాపులకు కేటాయిస్తూ కేంద్రానికి తీర్మానం చేసి పంపారు. అయితే కేంద్రం దాన్ని తిరస్కరించింది. దీంతో కాపులకు బీసీ రిజర్వేషన్ ఇవ్వడం కేంద్రం పరిధిలోని అంశమా లేక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందా అన్న చర్చ సాగింది.

బీసీ రిజర్వేషన్లపై కేంద్రం క్లారిటీ
రాష్ట్రాల్లో ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్ల కేటాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలా లేదా అనే దానిపై సందిగ్ధత ఉన్న నేపథ్యంలో ఈబీసీ రిజర్వేషన్ల విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇవాళ పార్లమెంట్ దృష్టికి తెచ్చారు. కాబట్టి ఓబీసీ రిజర్వేషన్లపై నిర్ణయం కేంద్రానిదా, రాష్టాలదా అని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై కేంద్రం తరఫున సామాజిక న్యాయశాఖ మంత్రి ప్రతిమా భౌమిక్ క్లారిటీ ఇచ్చారు. ఓబీసీ రిజర్వేషన్లు ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని ఆమె తెలిపారు.

కాపు రిజర్వేషన్లకు లైన్ క్లియర్ ?
ఓబీసీ రిజర్వేషన్లపై నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనంటూ కేంద్రం ఇచ్చిన క్లారిటీతో ఇప్పుడు ఏపీలో కాపు రిజర్వేషన్ల అంశంపైనా క్లారిటీ వచ్చినట్లయింది. పార్లమెంటులో ఓబీసీ రిజర్వేషన్లపై ప్రశ్న వేసిన సందర్భంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ కాపు రిజర్వేషన్ల వ్యవహారాన్ని కూడా లేవనెత్తారు. దీనిపై స్పందించిన కేంద్రమంత్రి ప్రతిమ.. ఓబీసీ రిజర్వేషన్లు రాష్ట్రాలు ఇచ్చుకోవచ్చని స్పష్టం చేయడంతో ఇప్పుడు కాపు రిజర్వేషన్లు కూడా ఈ కోటాలో ఇచ్చే అధికారం కూడా ఏపీకి ఉందని తేలిపోయింది.
Recommended Video

వైసీపీ ప్రభుత్వానికి సవాల్ కానుందా ?
ఓబీసీ రిజర్వేషన్లను ఇచ్చే అధికారం రాష్ట్రాలకు ఉందని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో ఏపీలో కాపు రిజర్వేషన్లను అమలు చేయాలంటూ బీజేపీ-జనసేన ద్వయం వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది. గతంలో కాపు రిజర్వేషన్లపై పాదయాత్రలో హామీ ఇవ్వాలని కాపులు కోరడంతో తన సహకారం ఉంటుందని మాత్రమే జగన్ హామీ ఇచ్చారు. కేంద్రం చేతుల్లో ఉన్న రిజర్వే్షన్ల అంశంపై కాపులకు సహకరిస్తానని తెలిపారు. ఇప్పుడు కేంద్రం క్లారిటీ ఇచ్చేసిన నేపథ్యంలో కాపుల రిజర్వేషన్ డిమాండ్ తెరపైకి వస్తే జగన్ ఎలా స్పందిస్తారో చూడాల్సిఉంది. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వంపై పోరుకు సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ కాపు రిజర్వేషన్ల డిమాండ్ వినిపించడం మొదలుపెడితే దీనిపై రాష్ట్రంలో మరో రాజకీయ సునామీ తప్పదన్న అంచనాలున్నాయి.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications