ఇలా కదిలొచ్చింది: విశాఖవాసి కాలేయం హైదరాబాదీకి (ఫొటోలు)
హైదరాబాద్: మానవ అవయాల మార్పిడి సర్వసాధారణమవుతోంది. ఆగమేఘాల మీద రాష్ట్ర సరిహద్దులను కూడా చెరిపేస్తూ అవయవాలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రవాణా అవుతున్నాయి. దీంతో కొన్ని ప్రాణాలు తిరిగి ఊపిరి పోసుకుంటున్నాయి.
తాజాగా, విశాఖ ‘కాలేయం' హైదరాబాద్‌కు తరలి వచ్చింది. విశాఖపట్నానికి చెందిన 53 ఏళ్ల సత్యనారాయణ ఈనెల 26న రోడ్డు ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలయ్యాడు. ఆయన్ని స్థానిక సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించగా వివిధ పరీక్షలు నిర్వహించిన అక్కడి వైద్యులు అతన్ని రక్షించేందుకు ఎంతో శ్రమించారు.

బలమైన గాయాలవల్ల అతని పరిస్థితి మరింత క్షీణించడంతో వైద్యుల బృందం బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. ఈ సమయంలోనే సత్యనారాయణ కుటుంబ సభ్యులకు అవయవదానం గురించి వివరించారు. దీంతో అక్కడి వైద్యుల సమాచారం మేరకు గ్లోబల్ ఆసుపత్రికి చెందిన మాథ్యూ జాకబ్స్, రాఘవేంద్ర,
మురగన్ రాజన్నల బృందం విశాఖపట్నంలోని సెవెన్‌హిల్స్ ఆసుపత్రికి చేరుకొని సత్యనారాయణ శరీరం నుంచిరెండు కిడ్నీలు, కాలేయాన్ని వేరుచేశారు.
ఒక కిడ్నీని అదే ఆసుపత్రిలోని వ్యక్తికి అమర్చగా, మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్ ఆసుపత్రికి తరలించారు. కాలేయాన్ని హైదరాబాద్‌లోని గ్లోబల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థకు చెందిన విమానంలో ప్రత్యేక బాక్స్‌లో అవయవాన్ని హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం ఉదయం 9:25 నిమిషాలకు సత్యనారాయణ కాలేయం ప్రత్యేక విమానంలో శంషాబాద్ఎయిర్‌పోర్టుకు చేరుకుంది.

అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్న అంబులెన్స్ 9:36 నిమిషాలకు అక్కడినుంచి బయలుదేరింది. అంతరాయం లేకుండా పోలీసులుఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రించడంతో 9:53 నిమిషాలకు లక్డీకాపూల్ గ్లోబల్ ఆసుపత్రికి చేరుకుంది. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న శస్తచ్రికిత్స నిపుణులు టాంచెరియన్, బల్‌బీర్‌సింగ్‌తో పాటు అనస్థీషియా నిపుణులు, ఇతర వైద్యసిబ్బంది కాలేయాన్ని ఆగమేఘాలమీద ఆపరేషన్ థియేటర్‌కు తరలించారు.

సంబంధిత వ్యక్తికి సత్యనారాయణకాలేయాన్ని విజయవంతంగాఅమర్చినట్టు గ్లోబల్ ఆసుపత్రి ఉపాధ్యక్షులు, మెడికల్ సర్వీసెస్ అండ్ ఆపరేషన్స్ హరీంద్రనాథ్ తెలిపారు.












Click it and Unblock the Notifications