ఏపికీ లోకల్ సమస్య!: ‘ఉద్యోగుల పిల్లలు, విద్యార్థుల స్థానికత’పై ప్రభుత్వ దృష్టి
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పరిసరాల నుంచే వీలైనంత త్వరగా పాలనా వ్యవహారాలను నిర్వహించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయానికి స్థానికత సమస్య ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే ఆ సమస్యను పరిష్కరించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
కొత్త రాజధాని ప్రాంతానికి తరలివెళ్లే ఉద్యోగులకు వసతి సౌకర్యం కల్పించాల్సి ఉంది. దీంతోపాటు వారి పిల్లల స్థానికత కల్పించాలి. ఈ నేపథ్యంలో కార్యదర్శుల కమిటీని ఏపీ సర్కార్ ఏర్పాటు చేసింది. వాస్తవానికి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 ప్రకారం ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునే వారు అంతకుముందు ఏడు సంవత్సరాల వ్యవధిలో నాలుగు సంవత్సరాల పాటు ఎక్కడ చదువుకుంటే ఆ ప్రాంతాన్ని వారి లోకల్‌గా పరిగణిస్తారు.
కాగా, ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు సీమాంధ్ర ప్రాంతం నుంచి వేల సంఖ్యలో ఉద్యోగులు విధినిర్వహణలో భాగంగా హైదరాబాద్ వచ్చి స్థిరపడ్డారు. వారి పిల్లలు కూడా హైదరాబాద్‌లోనే విద్యనభ్యసిస్తున్నారు. ఇప్పుడు తాత్కాలిక రాజధాని విజయవాడకు వెళ్లాలన్నా.. శాశ్వత రాజధాని అమరావతి వెళ్లాలన్నా.. పిల్లల భవిష్యత్తు ఉద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది.
కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్ వచ్చేసిన సీమాంధ్ర ఉద్యోగుల పిల్లలు హైదరాబాద్‌కే స్థానికులు అవుతారు. కొత్త రాజధాని ప్రాంతానికిగానీ, ఏపీలోని 13 జిల్లాలకు కానీ, వారు స్థానికులు కాలేరు. దీంతో రాష్ట్రపతి ఉత్తర్వులను సవరిస్తే తప్ప ఉద్యోగుల పిల్లల స్థానికత సమస్యకు పరిష్కారం లభించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో స్థానికత సమస్యను పరిష్కరించేందుకు ఏపీ ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఏర్పాటు చేసి విస్తృత చర్చలు ప్రారంభించింది.
హైదరాబాద్ నుంచి కొత్త రాజధానికి వెళ్లే ఉద్యోగుల పిల్లలందరినీ ఆ ప్రాంతానికి స్థానికులుగా గుర్తించాలా? దానికి ప్రామాణికత ఏమిటి? అన్న అంశంపై న్యాయనిపుణులు చర్చిస్తున్నారు.
హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రాంతానికి వెళ్లే ఉద్యోగుల పిల్లందరినీ ఏపీ ప్రభుత్వం ఆ ప్రాంతానికి లోకల్‌గా పరిగణించడంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. వారు ఇటు హైదరాబాద్‌కు(తెలంగాణకు) అటు కొత్త రాజధాని(ఏపి)కి స్థానికులవుతారు. దీనివల్ల ఏపీలో ఉన్న విద్యార్థులకు కొత్త సమస్యలు తలెత్తుతాయి. వారి నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశమూ ఉంది.

అదే, కాకుండా ఒక్క ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకే ఈ స్థానికత అమలు చేయడం కుదరదు. ప్రైవేటు ఉద్యోగులతోపాటు, ఇతర కారణాల వల్ల హైదరాబాద్ నుంచి కొత్త రాజధాని వెళ్లే వారి పిల్లలకూ వర్తింపజేయాల్సి వస్తుంది. ఇది కాస్త సంక్షిష్టమైన సమస్యగా మారుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మధ్యేమార్గాన్ని అన్వేషించినట్లు తెలుస్తోంది.
ఎప్పుడో దశాబ్దాల కిందట హైదరాబాద్‌లో స్థిరపడిన వారిని కూడా ఏపీకి లోకల్ అనడం కంటే గత ఏడేళ్ల వ్యవధిలో కనీసం రెండేళ్లపాటు ఆంధ్రాలో చదువుకొని ఉంటే అలాంటి విద్యార్థులను స్థానికులుగా పరిగణించాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం చురుగ్గా పరిశీలిస్తోంది. వాస్తవానికి ఇది ఉద్యోగుల అందరి సమస్య కాబోదని అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం కోరేవారికి అంతకుముందు ఏడేళ్ల విద్యాభ్యాసాన్ని లెక్కతీస్తారు. దీంతో ఆ ఏడేళ్లలో నాలుగేళ్లు ఏ ప్రాంతంలో ఉంటే అది అతని స్థానిక ప్రాంతమవుతుంది. సాధారణంగా ఇంజనీరింగ్, మెడిసిన్ లేదా డిగ్రీ చేరేవారే ఎక్కువగా ఉంటారు. ఈ కోర్సులకు కనీస విద్యార్హత ఇంటర్మీడియట్.
అంటే ఇంటర్‌కు ముందు ఏడేళ్లలో నాలుగేళ్లపాటు ఎక్కడ చదివారన్నది కీలకం. మరోవిధంగా చెప్పాలంటే 9వ తరగతి నుంచి ఇంటర్ లోపు విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకే స్థానికత సమస్యగా మారుతుందన్నది అధికార వర్గాల అంచనా. దీంతో అలాంటి వాళ్లు ఎంతమంది ఉన్నారన్న లెక్కలు తీసే పనిలో పడ్డారు.
ఇది ఇలా ఉండగా, హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే ఉద్యోగుల పిల్లలను 13 జిల్లాలతో కూడిన ఏపీ మొత్తానికి లోకల్‌గా ప్రకటించాలా? వారి వారి సొంత జిల్లాలకు లోకల్‌గా ప్రకటించాలా? అన్నది మరో సమస్యగా మారింది.
జిల్లా, జోనల్, మల్టీ జోనల్, రాష్ట్ర స్థాయి పోస్టులకు ఎంపికయ్యే వారికి, యూనివర్సిటీల్లో ప్రవేశం పొందేవారికి స్థానికతే కొలమానం. అందువల్ల కొత్త రాజధాని ప్రాంతానికి మాత్రమే లోకల్‌గా పరిగణిస్తే ఎలా ఉంటుంది అన్న అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.
ఇందులో పలు న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నందున న్యాయనిపుణుల సలహలు కూడా తీసుకోవాలని ప్రభుత్వం కార్యదర్శుల కమిటీని ఆదేశించింది. కాగా, ఉద్యోగ సంఘాలతో కూడా చర్చించి తుదినిర్ణయానికి వచ్చిన తర్వాతనే మంత్రివర్గం, అసెంబ్లీ ఆమోదంతో కేంద్రప్రభుత్వానికి పంపి రాష్ట్రపతి ఉత్తర్వులు సవరించాల్సి ఉంటుంది.
-
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
భారతీయులకు భారీ శుభవార్త.. హెచ్-1బీ ఆంక్షలు ఎత్తివేత..?? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
తెలంగాణా రైతులకు కేంద్రం తీపికబురు!












Click it and Unblock the Notifications