సింహం సింగిల్‌గా: జగన్‌పై రజనీకాంత్ డైలాగ్, 'ఖబడ్దార్ చంద్రబాబు'

విశాఖ: బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా విశాఖ జిల్లా చింతపల్లిలో వైసిపి బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు వేలాది మంది గిరిజనులు, స్థానికులు వచ్చారు. జగన్ తాను మాట్లాడడానికి ముందు.. కొందరు స్థానికులతో మాట్లాడించారు.

స్థానికులు కొందరు మాట్లాడుతూ... చంద్రబాబు చెప్పినట్లు బాక్సైట్ తవ్వకాల గురించి ఎలాంటి గ్రామ సభలు జరగలేదని, ఎలాంటి తీర్మానాలు జరగలేదన్నారు. అక్టోబర్ 2వ తేదీన గ్రామసభలు జరిగినట్లుగా కూడా తెలియదన్నారు. చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారన్నారు.

రత్నాబాయి అనే మహిళ మాట్లాడుతూ... మనకు చంద్రబాబు వద్దే వద్దు అంటూ మండిపడ్డారు. ఖబడ్దార్ చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సూరిబాబు అనే వ్యక్తి మాట్లాడుతూ... సింహం సింగిల్‌గా వస్తుందని, పందులు గుంపులుగా వస్తాయని, ఆ సింహమే జగన్ అన్న అని మాట్లాడారు.

Locals opposing bauxite mining in Vishaka

బాక్సైట్ తవ్వకాలు చేపడుతున్న చంద్రబాబు టిడిపిని అణగదొక్కేందుకు ఇదే సరైన వేదిక అంటూ సభను ఉద్దేశించి మాట్లాడారు. నాడు వైయస్ రాజశేఖర రెడ్డి.. మీ భూమి మీకే హక్కు అని చెప్పారన్నారు. అలాంటి మహానుభావుడు వైయస్‌పై విమర్శలు చేయడం సరికాదన్నారు.

మా జోలికి వస్తే సహించేది లేదన్నారు. వైయస్ తన హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. 108 వంటి వాహనాల ధ్వనులు అప్పుడు వినిపించేవని, ఇప్పుడు అవి ఎక్కడ ఉన్నాయని మండిపడ్డారు.

మరో వ్యక్తి మాట్లాడుతూ... ఈ కొండల్లో ఎన్నో ఔషధ మూలికలు ఉన్నాయన్నారు. ఇక్కడ బాక్సైట్ తవ్వకాలు జరిపితే... వర్షపు నీరు బాక్సైట్ ఖనిజంతో కలుషితమై నీరు ప్రమాదకరంగా మారుతుందన్నారు. మిగతా వాటి కంటే బాక్సైట్ ఖనిజం మరింత ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు.

ఇక్కడి నీరు పలు రిజర్వాయర్లకు వెళ్తుందని, ఈ నీటితో గిరిజన ప్రాంతాల ఆరోగ్యం దెబ్బతినే అవకాశముందన్నారు. బాక్సైట్ తవ్వకాల వల్ల నీరు కలుషితమైతే ఇక్కడి గిరిజన ప్రజలతో పాటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లోని పలువురు వ్యాధులతో సతమతమయ్యే ప్రమాదం ఉంటుందన్నారు. స్థానికులు.. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. జీవో 97 రద్దు చేయాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+