ట్విట్టర్ ట్రెండింగ్ లో నారా లోకేష్ - సాయిరెడ్డి అభినందనలు..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ రోజు లోకేష్ పుట్టినరోజు. యువగళం యాత్రకు సిద్దం అవుతున్న వేళ ఇప్పటికే యాత్ర పేరుతో ప్రత్యేకంగా పార్టీ కార్యకర్తలు..అభిమానులు సోసల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. నేడు జన్మదినం కావటంతో విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పార్టీ నేతలు లోకేష్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నారు. తన జన్మదినం నాడు అమ్మ నాన్న నుంచి లోకేష్ ఆశీర్వాదం తీసుకున్నారు. కుటుంబ సభ్యులతో పాటుగా పలువురు లోకేష్ కు శుభాకాంక్షలు చెప్పారు.

లోకేష్ కు బర్త్ డే విషెస్ చెబుతూ కార్యకర్తలు, నేతలు పెద్ద ఎత్తున నారా లోకేష్‌కు సోషల్ మీడియా వేదికగా సందేశాలు పెడుతుండటంతో #HBDYoungLeaderLokesh హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దేశ వ్యాప్తంగా నాలుగో స్థానంలో హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది. పలువురు నేతలు మంత్రిగా లోకేష్ నాడు తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. లోకేష్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. లోకేష్ కు వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేసారు. పలువురు ప్రముఖులు లోకేష్ కు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఇదే సమయంలో యువగళం యాత్ర కోసం లోకేష్ సిద్దం అవుతున్నారు. ఈ నెల 25న హైదరాబాద్ లోని తన నివాసం నుంచి బయల్దేరనున్నారు.

Lokesh Birth day Hash tag tending in Twitter, Vijayasai reddy extends birthday wishes

25వ తేదీ మధ్నాహ్నం ఎన్టీఆర్ ఘాట్ లో తాత ఎన్టీఆర్ సమాధికి నివాళి అర్పిస్తారు. అక్కడ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకొని కడప వెళ్తారు. అక్కడ అమీన్ పీర్ దర్గా సందర్శిస్తారు. అనంతరం కడప లోని చర్చిలో ప్రార్ధనల్లో పాల్గొంటారు. రాత్రికి తిరుమల చేరుకుంటారు. 26వ తేదీ ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. 10.30 గంటలకు తిరుమల నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కుప్పం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకుంటారు. 26వ తేదీ సాయంత్రంగా లోకేష్ కుటుంబ సభ్యులు కుప్పం రానున్నారు. 27వ తేదీ సభ తరువాత కుప్పం నుంచి లోకేష్ యువగళం యాత్ర ప్రారంభం కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+