కేంద్రానికి థ్యాంక్స్ చెప్పిన లోకేష్: ఎందుకంటే..?
ఢిల్లీ/అమరావతి: చిత్తూరు జిల్లా రేణిగుంట ఈఎంసీని గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్‌గా గుర్తిస్తూ కేంద్రం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచన మేరకు రూపుదిద్దుకున్న ఈ క్లస్టర్‌కు 2015లోనే ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు.
113.27ఎకరాల్లో మౌలిక వసతులతో ఏర్పాటుచేసిన ఈఎంసీలో సెల్కాన్, కార్బన్, లావా3 ప్రధాన మొబైల్ తయారీ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయి. సెల్కాన్, డిక్సన్ ఇప్పటికే ఇక్కడి నుంచి కార్యకలాపాలు కొనసాగిస్తుండగా, త్వరలోనే కార్బన్ సంస్థ తయారీ ప్రారంభించనుంది.

కాగా, రేణిగుంట ఈఎంసీ క్లస్టర్‌కు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు ఏపీ మంత్రి నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఏపీని మొబైల్, ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి హబ్‌గా చేస్తామని అన్నారు.
మొబైల్ తయారీలో బ్యాటరీ నుంచి అన్ని రకాల విడిభాగాలు ఏపీలో తయారయ్యేలతా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు. త్వరలోనే అనంతపురంలోనూ ఎలక్ట్రానిక్ మానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు లోకేష్ తెలిపారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications