తిరుమలలో రధ సప్తమి - స్వామి వారి దర్శనం ఇలా : ఆ సేవలు రద్దు..!!
Tirumala: తిరుమలలో రధసప్తమి కి టీడీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 28న తిరుమల శ్రీవారి ఆలయంలో రధసప్తమి పర్వదినం జరగనుంది. రధసప్తమి నాడు ఉదయం నుంచి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సూర్యజయంతిగా జరుపుకుకొనే ఈ పర్వదినం నాడు ప్రత్యేకంగా సిద్దం చేసిన ఏడు వాహనాల్లో స్వామి వారు దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్ర వరకు ఈ ఏడు వాహనాల ఊరేగింపు ఉంటుంది. దీనికి సంబంధించి అధికారులు సమయాలను వెల్లడించారు.
ఈ నెల 28న తిరుమలలో రథసప్తమి సందర్భంగా ప్రత్యేకంగా కార్యక్రమాలను ఖరారు చేసారు. ఒకేరోజు ఏడు వాహనాలపై స్వామివారు దర్శనం ఇవ్వనున్నారు. ఉదయం 5.30 నుంచి 8 గంటల వరకు (సూర్యోదయం ఉదయం 6.45 గంటలకు) - సూర్యప్రభ వాహనం పైన స్వామి వారి ఊరేగింపు ఉంటుంది. ఆ తరువాత ఉదయం 9 నుంచి 10 గంటల వరకు - చిన్నశేష వాహనం పైన మాడ వీధుల్లో స్వామి వారి ఊరేగింపు నిర్వహణకు నిర్ణయించారు. ఈ రెండు వాహనాల సేవలు తరువాత ఉదయం 11 నుంచి 12 గంటల వరకు - గరుడ వాహనం లో ఊరేగింపు ఉంటుంది. మధ్నాహ్నం 2 గంటల నుంచి 3 వరకు స్వామి వారి చక్రస్నానం ఉంటుందని అధికారులు వెల్లడించారు.

సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు - కల్పవృక్ష వాహనం పై మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు అయిదో వాహనంగా సర్వ భూపాల వాహనం పైన స్వామి వారి ఊరేగింపు నిర్వహించాలని నిర్ణయించారు. ఆరో వాహనంగా సర్వభూపాల వాహనం పైన సాయంత్రం 6 గంటల నుంచి ఏడు గంటల వరకు ఊరేగింపు ఉంటుంది. ఈ వాహనాల ద్వారానే భక్తులకు స్వామి వారి దర్శనం కలగనుంది. చివరగా రాత్రికి 8 గంటల నుంచి 9 గంటలకు స్వామి వారు చంద్రప్రభ వాహనంలో మాడ వీధుల్లో విహరిస్తారు. రధ సప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టిటిడి రద్దు చేసింది.












Click it and Unblock the Notifications