దూసుకెళ్లిన లారీ: ఇద్దరు గోవిందమాల భక్తుల మృతి

తిరుపతి: చిత్తూరు జిల్లాలో మంగళవారం ఓ లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న గోవిందమాల భక్తులపైకి లారీ అదుపు తప్పి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ మేరకు మంగళవారం ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి. గాయపడినవారిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. గాయపడినవారిని చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా పుత్తూరు ఆస్పత్రికి తరలించారు.

Lorry accident: two dead in Tirumala

మృతులను తమిళనాడు రాజధాని చెన్నైవాసులుగా గుర్తించారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం పాలమంగళం వద్ద మంగళవారం తెల్లవారు జామున జరిగింది.

లారీ డ్రైవర్ నిద్ర మత్తులో వాహనాన్ని నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+