పెద్దలు అంగీకరించరేమోనని ప్రేమజంట ఆత్మహత్య
గుంటూరు: జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాలెం గ్రామ శివారులోని పంట కాలువ వద్ద బుధవారం తెల్లవారుజామున విషాద ఘటన చోటు చేసుకుంది. తమ ప్రేమను పెద్దలు ఒప్పుకోరనే అనుమానంతో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది.
కలిసి బతకలేక పోయినా చావులోనైనా కలిసే ఉందామని నిర్ణయించుకున్న ప్రేమికులు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా ప్రియుడు అక్కడికక్కడే మృతిచెందాడు. కాగా, ప్రియురాలు చికిత్స పొందుతూ మృతి చెందింది.
వివరాల్లోకి వెళితే.. ముప్పాళ్ల మండలం తొండపి గ్రామానికి చెందిన ఎర్ర శ్రీకాంత్(22), అచ్చంపేట మండలం గ్రందసిరి గ్రామానికి చెందిన భువనేశ్వరి(19) ప్రేమించుకున్నారు. ఇది తెలిసిన కుటుంబ సభ్యులు చదువు మానిపించి ఇంటికే పరిమితం చేశారు. కులాలు వేరు కావడంతో తల్లిదండ్రులు తమ పెళ్లికి ఒప్పుకోరని నిర్ణయించుకున్న ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రేమికులిద్దరు మంగళవారం రాత్రి రెంటపాలెం చేరుకొని వెంట తెచ్చుకున్న పురుగుల మందును తాగారు. దీంతో శ్రీకాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. భువనేశ్వరి అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

బుధవారం ఉదయం గుర్తించిన స్థానికులు ఆమెను సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భువనేశ్వరి కొద్ది సేపటి క్రితం మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బస్టాండ్ బాత్ రూంలో మహిళ ప్రసవం
పశ్చిమగోదావరి: భీమవరం ఆర్టీసీ బస్టాండులోని బాత్‌రూంలో ఓ మహిళ ప్రసవించింది. నాగవల్లి అనే మహిళ ఆడపిల్లకు జన్మనిచ్చింది. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి కైకలూరు ఆస్పత్రికి తీసుకువెళుతుండగా ఈ ఘటన జరిగింది. తల్లీబిడ్డలను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
సాగర్ క్యాంపులో కొండచిలువు
విజయపురిసౌత్: స్థానిక సాగర్ క్యాంపుకు చెందిన చెల్లూరి అప్పల్రాజు ఇంటి ఆవరణలో మంగళవారం 10అడుగుల కొండచిలువ ప్రత్యక్షమైంది. గమనించిన అప్ప ల్రాజు గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్స్ ఆర్గనైజేషన్ లీడరు మహేష్‌కు సమాచారం అందించారు. ఆర్గనైజేషన్ సభ్యులు పవన్, లక్ష్మణ్‌తోపాటు మహేష్ అక్క డకు చేరుకుని కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం ఆర్గనైజేషన్ సభ్యులు సమీప అడవిలో పామును వదిలిపెట్టారు.












Click it and Unblock the Notifications