ప్రేమజంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడు మృతి

Lovers try to commit suicide
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో శుక్రవారం విషాద సంఘటన చోటు చేసుకుంది. వనటౌన్‌లోని ఓ లాడ్జిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సంఘటనలో ప్రియుడు మృతి చెందారని తెలుస్తోంది. ప్రియురాలి పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు. లాడ్జి యజమాని పరారీలో ఉన్నాడని సమాచారం.

ఆంత్రాక్స్ లక్షణాలు

అనంతపురం జిల్లాలో ఓ పదో తరగతి విద్యార్థికి ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించారు. అతనిని చికిత్స నిమిత్తం హిందూపురం ఆసుపత్రికి తరలించారు.

తిరుపతిలో కాంట్రాక్టర్ల వినూత్న నిరసన

చిత్తూరు జిల్లాలోని తిరుపతి టీటీడీలో ఇంజనీరింగ్‌ పనులకు సర్వీస్‌ టాక్స్‌ను మీరే కట్టుకోవాలన్న దేవస్థానం తీరుపై కాంట్రాక్టర్లు శుక్రవారం వినూత్న రీతిలో నిరసనకు దిగారు. గోవింద... గోవింద అంటూ వీధుల్లో భిక్షాటన చేశారు.

రౌడీషీటర్‌ హత్య కేసులో ముగ్గురి అరెస్టు

పశ్చిమ గోదావరి జిల్లాలో రౌడీ షీటర్‌ రామనాథంను హత్య చేసిన ముగ్గురిని ఏలూరు ట్రాఫిక్‌ సిఐ దాసు అరెస్టు చేశారని ఏలూరు డీఎస్పీ కెజివి సరిత చెప్పారు. ఏలూరులోని డీఎస్పీ కార్యాలయంలో గురువారం రాత్రి జరిగిన సమావేశంలో ఆమె గురువారం మాట్లాడారు.

ఏలూరులోని మస్తాన్‌ మన్యం కాలనీకి చెందిన రౌడీషీటర్‌ బండి రామనాథంను ఈ నెల 21 అర్ధరాత్రి పాతగొడవల నేపథ్యంలో సత్యనారాయణపేటకు చెందిన పట్నాల మోహన్‌ (31), తియ్యాల కిరణ్‌ (27), భేతా రత్నకుమార్‌ (24) ఇనుపరాడ్డులతో కొట్టి హత్య చేశారు.

ఈ సంఘటనపై ఏలూరు వన్‌ టౌన్‌ ఎస్‌ఐ కె నాగేంద్రప్రసాద్‌ కేసు నమోదు చేయగా ఏలూరు ట్రాఫిక్‌ సిఐ దాసు దర్యాప్తు చేపట్టారు. నిందితులు గురువారం మధ్యాహ్నం వీఆర్వో వద్దకు వెళ్లి తామే రామనాథాన్ని హత్య చేశామని చెప్పారు. ఆ ముగ్గురిని వీఆర్వో సిఐ దాసుకు అప్పగించారు. ఆయన వారిని విచారించి అరెస్టు చేశారు. హత్యకు వినియోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+