జగన్‌తో మంచు విష్ణు భేటీ: ప్రత్యక్ష రాజకీయాల్లోకి: మోహన్ బాబు తప్పుకొన్న వేళ: ఆ హామీ?

అమరావతి: ఏపీలో కొంతకాలంగా కొనసాగుతూ వస్తోన్న సినిమా టికెట్ల వివాదం పరిష్కార దిశగా అడుగులు పడిన వేళ.. కొద్దిరోజుల కిందటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటులు, దర్శకులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన సందర్భంలో.. మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరుడిగా పేరున్న ప్రముఖ నటుడు, నిర్మాత, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు- వైఎస్ జగన్‌ను కలిశారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.

అసంతృప్తి..బుజ్జగింపుల కోసమేనా?

అసంతృప్తి..బుజ్జగింపుల కోసమేనా?

సినిమా టికెట్ల వివాదాన్ని పరిష్కరించుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి, పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి, సూపర్ స్టార్ మహేష్ బాబు, రెబెల్ స్టార్ ప్రభాస్, దర్శకులు ఎస్ఎస్ రాజమౌలి, కొరటాల శివ, హాస్యనటుడు అలీ, క్యారెక్టర్ యాక్టర్ పోసాని కృష్ణమురళి ముఖ్యమంత్రిని కలిసిన విషయం తెలిసిందే. చిరంజీవి సారథ్యాన్ని వహించిన ఈ టీమ్‌లో మంచు కుటుంబానికి ప్రాతినిథ్యాన్ని కల్పించలేదు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున మంచు విష్ణు ఈ భేటీకి దూరంగా ఉన్నారు.

భేటీ రోజే వివాదాస్పద ట్వీట్..

భేటీ రోజే వివాదాస్పద ట్వీట్..

చిరంజీవి సారథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు వైఎస్ జగన్‌ను కలిసిన వెంటనే.. మంచు విష్ణు ఓ ట్వీట్ చేయడం.. ఆ తరువాత కొద్దిసేపటికే దాన్ని డిలేట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రివర్స్‌ మ్యానర్‌లో చేసిన ట్వీట్ అది. తనకు ప్రాతినిథ్యాన్ని కల్పించకపోవడం పట్ల ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారని, ఇందులో భాగంగానే ఈ ట్వీట్ చేశారంటూ వార్తలొచ్చాయి. ఆ మరుసటి రోజే- సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని స్వయంగా.. మోహన్ బాబు ఇంటికెళ్లారు. మోహన్ బాబు, విష్ణులను కలుసుకున్నారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం..

ప్రత్యక్ష రాజకీయాలకు దూరం..

పేర్నినానితో సమావేశమైన అనంతరం మోహన్ బాబు ఓ కీలక ప్రకటన చేసినట్లు వార్తలొచ్చాయి. ప్రత్యక్ష రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు కలెక్షన్ కింగ్ స్పష్టం చేశారనే ప్రచారం విస్తృతంగా సాగింది. దీన్ని మోహన్ బాబు గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ తోసిపుచ్చలేదు. వైఎస్ జగన్ వైఖరి పట్ల కొంత అసంతృప్తితో ఉన్నారని, పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేసినప్పటికీ.. పట్టించుకోవట్లేదనే వాదన వినిపించింది.

వైఎస్ జగన్‌తో విష్ణు భేటీ వెనుక..

వైఎస్ జగన్‌తో విష్ణు భేటీ వెనుక..

ఈ పరిణామాల మధ్య వైఎస్ జగన్‌తో మంచు విష్ణు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ మధ్యాహ్నం ఆయన హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో తాడేపల్లికి చేరుకున్నారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీని విడుదల చేయడానికి నిర్వహించిన సమీక్ష సమావేశం ముగిసిన వెంటనే వైఎస్ జగన్- మంచు విష్ణును కలుసుకున్నారు. దీనికి పెద్దగా ప్రాధాన్యత లేదని చెబుతున్నారు. లంచ్ మీటింగ్ మాత్రమేనని అంటున్నారు.

రాజ్యసభ హామీ కోసమేనా..

రాజ్యసభ హామీ కోసమేనా..

మోహన్ బాబు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొంటారంటూ ప్రచారం సాగుతున్న ఈ పరిస్థితుల్లో మంచు విష్ణు.. హఠాత్తుగా వైఎస్ జగన్‌ను కలుసుకోవడానికి ప్రాధాన్యత ఏర్పడింది. మూవీ ఆర్టిస్ట్ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన తరువాత ఆయన విష్ణు.. ముఖ్యమంత్రిని కలుసుకోవడం కూడా ఇదే తొలిసారి. మా అధ్యక్షుడి హోదాలో మర్యాదపూరకంగా మాత్రమే ఆయన వైఎస్ జగన్‌ను కలిసినట్లు చెబుతున్నప్పటికీ.. ఈ భేటీపై విస్తృతంగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాజ్యసభకు ఎంపిక చేయాలనే హామీ పొందడానికే వైఎస్ జగన్‌ను విష్ణు కలిశారనే ప్రచారం ఉంది.

వైసీపీ సానుభూతిపరుడిగా..

వైసీపీ సానుభూతిపరుడిగా..

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతిపరులుగా మంచు కుటుంబానికి పేరుంది. వైఎస్ కుటుంబంతో మంచు కుటుంబానికి దగ్గరి బంధుత్వం కూడా ఉంది. 2019 నాటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మంచు విష్ణు.. వైసీపీ గెలుపు కోసం ప్రచారం సైతం చేశారు. విశాఖపట్నం మొదలుకుని తమ సొంత జిల్లా చిత్తూరు వరకూ విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత- మంచు కుటుంబం ఎలాంటి పదవులను కూడా ఆశించలేదు. మోహన్ బాబును రాజ్యసభకు పంపిస్తారనే ప్రచారం మొదట్లో సాగినా.. ఆ తరువాత అదీ తెరమరుగైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+