చంద్రబాబు ప్రత్యేక శ్రద్ద పెట్టినా పెద్దిరెడ్డి అనుచరుడు మాత్రం జంప్ జిలాని
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన అగ్నిప్రమాదం కేసుకు సంబంధించి పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో తప్పించుకుని తిరుగుతున్న కొందరిని పట్టుకోవడానికి పోలీసులు వివిధ రాష్ట్రాల్లో పాలిస్తున్నారు. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్ని ప్రమాదం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అనుచరుడు మాధవ రెడ్డిని పట్టుకుంటే కేసు ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు అంటున్నారు. అయితే అగ్నిప్రమాదం జరిగి ఇన్ని రోజులైనా వైసీపీ నాయకుడు మాధవ రెడ్డి ఆచూకీ చిక్కడం లేదని కేసు దర్యాప్తు చేస్తున్న ఓ పోలీస్ అధికారి అంటున్నారు. ఇప్పటికే బెంగళూరు, చెన్నై, ఢిల్లీ ముంబాయి నగరాల్లో వైసీపీ నాయకుడు మాధవ రెడ్డి కోసం గాలించినా ఆచూకి మాత్రం చిక్కడం లేదని పోలీసు అధికారులు అంటున్నారు.

మదనపల్లె నుండి వెళ్లిపోయే సమయంలో వైసీపీ నాయకుడు మాధవరెడ్డి ఆయన మొబైల్ ఫోన్ ఆయన ఇంట్లోనే వదిలి వెళ్లిపోయాడని, అతని మొబైల్ ఫోన్ ట్రేస్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని, అతను ఏ ఫోన్ ఉపయోగిస్తున్నాడో తెలుసుకోవడం సాధ్యం కావడం లేదని ఓ పోలీస్ అధికారి అంటున్నారు. ఇప్పటికే మాధవ రెడ్డితో లింక్ ఉన్న వైసీపీ నాయకులను పోలీసు అధికారులు విచారణ చేసినా మాధవ రెడ్డి మాత్రం చిక్కడం లేదు.
మాధవరెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ లను పోలీసులు, రెవెన్యూ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు మదనపల్లెతో పాటు తంబాళపల్లె, పుంగనూరు నియోజక వర్గాల పరిధిలోని భూముల పత్రాలు మాధవ రెడ్డి ఇంట్లో చిక్కాయని సమాచారం. అయితే ఏ విషయం గాని బయటకు రాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాధవ రెడ్డి చిక్కిన తర్వాతనే పూర్తి సమాచారం బయటకు చెబుతామని ఓ పోలీస్ అధికారి అంటున్నారు.












Click it and Unblock the Notifications