జేసీ ప్రభాకర్ రెడ్డిపై హైదరాబాద్‌లో మాధవీలత ఫిర్యాదు

అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి, బీజేపీ నేత మాధవీలత హైదరాబాద్ సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఇటీవల అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం సైబరాబాద్ సీపీని కలిసిన మాధవీలత.. రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా మాధవీలత మాట్లాడుతూ.. జేసీ ప్రభాకర్ రెడ్డి అభ్యంకరమైన మాటలతో తాను, తన కుటుంబం తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. క్షమాపణలు చెప్పానంటే సరిపోతుందా? సీనియర్ నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా అంటూ మాధవీలత నిలదీశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి మాటలతో చాలా ఇబ్బందిపడినట్లు తెలిపారు.

Madhavilatha files complaint against JC Prabhakar Reddy with Cyberabad Police

ప్రజాక్షేత్రంలో ఉండే నాయకులు ఇలాంటి భాష మాట్లాడితే ఎలా? అని మాధవీలత అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్‌లోనూ మాధవీలత ఫిర్యాదు చేశారు. మా ట్రెజరర్ శివ బాలాజీకి ఫిర్యాదు పత్రాన్ని ఆమె అందించారు. న్యాయం కోసం పోరాటం చేస్తానని మాధవీలత సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు.

జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఫిల్మ్ ఛాంబర్ తోపాటు మానవ హక్కుల సంఘానికి, పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మాధవీలత వెల్లడించారు. జేసీ ప్రభాకర్ రెడ్డి తనపై చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారన్నారు. తనపై చేసిన వ్యాఖ్యలపై ఇండస్ట్రీ కూడా ఖండించలేదన్నారు. అందుకే తాను 'మా'కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మా ట్రెజరర్ శివబాలాజీకి ఫోన్ చేస్తే వెంటనే స్పందించారని మాధవీలత తెలిపారు.

తన ఫిర్యాదును మా అధ్యక్షుడు మంచు విష్ణు దృష్టికి కూడా తీసుకెళ్లారని చెప్పారు. తాను కఠినంగా మాట్లాడినా నిజాలే మాట్లాడతానని అన్నారు. సినిమా వాళ్లను అందరూ అవమానిస్తారని.. కానీ, రాజకీయాల్లోకి వెళ్లి సినిమా వాళ్లే సత్తా చాటుతన్నారని మాధవీలత తెలిపారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని మాధవీలత పేర్కొన్నారు.

కాగా, కొత్త సంవత్సరం వేడుకలను పురస్కరించుకుని డిసెంబర్ 31న తాడిపత్రిలో జేసీ పార్కులో 'మహిళలకు మాత్రమే' అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దీనిపై మాధవీలత స్పందిస్తూ.. ఇలాంటి వేడుకలకు వెళ్లకూడదని, తిరుగు ప్రయాణంలో అర్ధరాత్రి వేళ ఏదైనా జరిగితే ఎవరు కాపాడతారని అన్నారు. దీంతో జేసీ ప్రభాకర్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి.. మాధవీలతపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, బీజేపీ, ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీలపైనా జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అయితే, నలువైపుల నుంచి విమర్శలు రావడంతో మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+