సీటిచ్చాక ఏంటీ టార్చర్, అవమానమే - మహాసేన రాజేష్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. షెడ్యూల్ విడుదల కావటంతో పార్టీలు ప్రచారం పైన ఫోకస్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ ఎన్డీఏ కూటమి తొలి సభలో పాల్గొన్నారు. కూటమిలోని మూడు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు పై ఒక నిర్ణయానికి వచ్చారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పీ గన్నవరం సీటును తొలి జాబితాలో టీడీపీ మహాసేన రాజేష్ కు కేటాయించింది. ఆ తరువాత మార్పు చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ వ్యవహారం పై మహాసేన రాజేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు పైన ఇప్పటికే నిర్ణయం జరిగింది. టీడీపీ తొలి జాబితాలో 94, రెండో జాబితాలో 34 స్థానాల్లో తమ అభ్యర్దులను ప్రకటించింది. తొలి జాబితాలోనే పీ గన్నవరం స్థానం నుంచి మహాసేన రాజేష్ ను తమ అభ్యర్దిగా ప్రకటించింది. ఈ ప్రకటన పైన జనసేనతో సహా ఇతరులు అభ్యంతరం వ్యక్తం చేసారు. స్థానిక జనసేన శ్రేణులు పార్టీ కార్యాలయంలో నిరసనకు దిగారు. ఆ తరువాత పలువురు నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. దీంతో, మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రచారం సాగింది. కానీ, అధికారికంగా ప్రకటన చేయలేదు.

ఇప్పుడు పొత్తులో భాగంగా పీ గన్నవరం సీటును జనసేనకు ఇవ్వాలని టీడీపీ నిర్ణయించింది. దీని పైన మహాసేన రాజేష్ స్పందించారు. పీ గన్నవరంలో తనను తప్పించినట్లుగా చంద్రబాబు చెప్పలేదని వెల్లడించారు. టీడీపీ, జనసేన తనను అవమానిస్తున్నట్లుగా ఉందని పేర్కొన్నారు. మూడు పార్టీలు పొత్తులో ఉన్నాయని..తనను తప్పించినట్లు చెప్పకుండానే జనసేన అభ్యర్దుల పేరుతో పీ గన్నవరంలో ఐవీఆర్ఎస్ కాల్స్ పేరుతో సర్వేలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కడ తాను ఇంఛార్జ్ గా ఉన్నానని గుర్తు చేసారు. చంద్రబాబు తనకు సీటు లేదు, పక్కన ఉండు అని చెప్పే వరకు వేచి చూడాలి కదా అంటూ అసహనం వ్యక్తం చేసారు.
నన్ను P గన్నవరం లో తీసి వేసినట్టు నాకు చెప్ప కుండా జనసేన కి టికెట్ ఇస్తున్నారు IVRS కాల్స్ చేస్తుంది పార్టీ.. ఇది నన్ను అవమానించడమే.. మహాసేన pic.twitter.com/KExd0YXXOt
— Amar Amar (@amarballa2) March 17, 2024
తన సీటు జనసేన కోరుతుందంటే తనను అవామనిస్తున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు. తనకు సీటు ఇచ్చిన తరువాత ఏంటీ టార్చర్ అంటూ ఆగ్రహం వ్యక్తంచేసారు. సీటు ఇవ్వని వరకు 15 రోజుల క్రితం వరకు చాలా ప్రశాంతంగా ఉన్నానంటూ రాజేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో..ఇప్పుడు పీ గన్నవరం సీటు జనసేనకు కేటాయించినట్లుగా టీడీపీ నేతలు చెబుతున్న ఈ సమయంలో రాజేష్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. దీంతో, ఇక్కడ పోటీ పైన తుది నిర్ణయం ఏంటనేది తేలాల్సి ఉంది.












Click it and Unblock the Notifications