మహేష్ బాబు - రాజమౌళి సినిమాపై ఊహించని ట్విస్ట్
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు చేయబోయే సినిమా మీద ఇప్పటి నుంచే అంచనాలు మొదలయ్యాయి. ప్రొడక్షన్ వర్క్ మొదలవకుండా, షూటింగ్ ప్రారంభించకముందే ఈ చిత్రంపై హైప్ క్రియేటైంది. ఒక కథను రెండు భాగాలుగా విడగొడితే రెండు లాభాలు ఎలా సంపాదించవచ్చో బాహుబలితో రాజమౌళి నిరూపించాడు. బాహుబలి బాటలో చాలా చిత్రాలు నడిచాయి. కేజీఎఫ్, పుష్ప, పొన్నియన్ సెల్వన్ లాంటివన్నీ రెండు భాగాలుగా వచ్చాయి.
మహేష్ బాబుతో తీయబోయే సినిమాను కూడా పార్ట్ 1, పార్ట్ 2 గా విభజించబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. రెండు భాగాలుగా తీస్తే ఎలా ఉంటుంది? అనే యోచనలో రాజమౌళి ఉన్నట్లు సమాచారం. ఎంచుకున్న కథలో రెండు భాగాలకు సరిపోయే స్టఫ్ ఉందని, దాన్ని వదులుకోకూడదనేది దర్శకుడి అభిప్రాయంగా ఉంది.

సినిమాను రెండు భాగాలుగా తీయాలంటే కథానాయకుడు మరికొంత సమయాన్ని ఎక్కువగా కేటాయించాల్సి ఉంటుంది. రాజమౌళి సినిమా అంటేనే దాదాపు 2 సంవత్సరాలు పడుతుంది. రెండు పార్టులంటే మరో సంవత్సరం అదనంగా కేటాయించాల్సి ఉంటుంది. బాహుబలి విషయంలో ఇలాగే జరిగింది. అందుకు తగ్గ ఫలితాన్ని ప్రభాస్ పొందారు. మహేష్ బాబు సినిమా కూడా ఇప్పుడు దాన్నే పునరావృతం చేయబోతోంది.
పని రాక్షసుడిగా పేరు తెచ్చుకున్న రాజమౌళి ఒకటి చేయాలి అనుకున్నాడంటే అది పూర్తయ్యేవరకు నిద్రపోడు. మహేష్ బాబు కూడా రాజమౌళి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయడానికి సిద్ధపడుతున్నాడు. రెండు భాగాలుగా వస్తుందా? రాదా? అనేది రాజమౌళి తీసుకునే అంతిమ నిర్ణయంపై ఆధారపడివుంటుంది. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మంచబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా తీయబోయే ఈ సినిమాపై భారతీయ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.












Click it and Unblock the Notifications