షూటింగ్ ఆగిపోయిన మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమా?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్ విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యంలో ముంచెత్తారు. చిత్రమేమిటంటే ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రారంభించారో కానీ అప్పటి నుంచి గడ్డుకాలాన్ని ఎదుర్కొంటోంది. సినిమా ప్రారంభమవడానికి ఎప్పుడో అయింది. అయితే రకరకాల కారణాలతో షూటింగ్ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చింది. మధ్యలో మహేష్ బాబు విదేశాలకు కూడా వెళ్లివచ్చారు.
జూన్ మొదటివారం నుంచి షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ప్రకాష్ రాజ్, జగపతిబాబు, జయరాం వంటి నటులను ఎంపిక చేశారు. అయితే మధ్య మధ్యలో షూటింగ్ ఆగిపోవడం, త్రివిక్రమ్ వేరే చిత్రాలకు సహకారం అందిస్తుండటంతో ముందుగా అనుకున్న సమయానికి కాల్షీట్లు ఇచ్చిన నటుల కాల్షీట్లు వృథా అయ్యాయి. తిరిగి ఈ సినిమా షూటింగ్ 12వ తేదీన ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది.

త్రివిక్రమ్ సినిమా అంటేనే నటులు ఎక్కువమంది కనపడుతుంటారు. అందుకు తగ్గట్లు గా ఆయన కథలన్నీ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో కూడుకొని ఉంటాయి. మొదటి ఇచ్చిన కాల్షీట్లు వృథా అవడం, తాజాగా ఇప్పుడున్న డేట్లు ఇతర సినిమాలకు కేటాయించడంతో వీరికోసం ఎదురుచూడాల్సి వస్తోంది. ఒకే షెడ్యూల్ లోకి వీరందరి డేట్లు తీసుకురావడం త్రివిక్రమ్ కు చాలా కష్టమైన పని. గుంటూరు కారం రోజురోజుకు ఆలస్యమవడానికి ఇదే ప్రత్యేక కారణం. వీరిపై రూపొందించాల్సిన సన్నివేశాలను వీలైనంత తొందరగా పూర్తిచేయాలని త్రివిక్రమ్ నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన నటీ నటులకు, సాంకేతిక నిపుణులకు తెలియజేశారు. గుంటూరు కారం 2024 సంక్రాంతికి విడుదల కాబోతోంది. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.












Click it and Unblock the Notifications