మహేష్ కత్తి తాజా టార్గెట్ చంద్రబాబు: పవన్ ఫ్యాన్స్‌పై "తిక్క"గా...

హైదరాబాద్: సినీ విమర్శకుడు మహేష్ కత్తి తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వరుసగా విమర్శలు సంధిస్తూ వస్తున్న ఆయన చంద్రబాబును తన లక్ష్యంగా చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆలయాల్లో నూతన సంవత్సర వేడుకలను నిషేధించడాన్ని ఆసరా చేసుకుని ఆయన చంద్రబాబుపై విమర్శలు చేశారు. నూతన సంవత్సర వేడుకలను ఆలయాల్లో రద్దు చేయడం మూర్ఖత్వానికిక పరాకాష్టగా భావిస్తున్నారు.

 వేడుకలపై చంద్రబాబు ప్రభుత్వం లా...

వేడుకలపై చంద్రబాబు ప్రభుత్వం లా...

దేవాలయాల్లో జనవరి ఒకటవ తేదీన ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మనకు నూతన సంవత్సరం జనవరిలో కాదు, ఉగాది పర్వాదిన ఆరంభం అవుతుందని స్పష్టం చేసింద.

 చంద్రబాబుపై మహేష్ కత్తి ఇలా..

చంద్రబాబుపై మహేష్ కత్తి ఇలా..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాల్లో నూతన సంవత్సరం వేడుకలను రద్దు చేయడాన్ని విమర్సిస్తూ మహేష్ కత్తి ఫేస్‌బుక్‌లో చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారు. "చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు !" అని ఆయన అన్నారు.

 పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై ఇలా...

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌పై ఇలా...

"నన్ను ఆపమని నీతులు చెబుతున్నవాళ్లకు నేను చెప్పేది ఒకటే, ఇంత జరుగుతుంటే నాలాగా మీరు ఒక రోజు కూడా బ్రతకలేరు. కాబట్టి నన్ను కాదు, నిజంగా మీరు మనుషులైతే తిక్క పవన్ కళ్యాణ్ ని అతని పిచ్చి సేనను ఆనండి. మరొక్కసారి నాకు నీతులు చెప్పకండి. నా పోరాటం నాది. మీది కాకపోయినా పర్లేదు. నాకు పిరికిమందు మాత్రం పొయ్యొద్దు" అని ఇటీవల పవన్ కల్యాణ్‌పై కూడా విరుచుకుపడ్డారు

 వైఎస్ జగన్ కోసమేనా...

వైఎస్ జగన్ కోసమేనా...

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కోసమే మహేష్ కత్తి వరుసగా పవన్ కల్యాణ్‌పై విరుచుకుపడుతున్నారనే అభిప్రాయం ఉంది. తాజాగా చంద్రబాబుపై కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం ఆ విషయాన్నే ధ్రువీకరిస్తోందని అంటున్నారు. మహేష్ కత్తి వ్యాఖ్యలపై వార్తలు రాస్తున్న మీడియాపై కూడా పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+