'అశోక్‌బాబును వెతికి పెట్టండి': టిడిపిలోకి జగన్‌పార్టీ నేత

అసెంబ్లీకి బిల్లు వస్తే అసెంబ్లీ ముట్టడిచేస్తాం, హైదరాబాద్‌ను దిగ్బంధం చేస్తామంటూ పెద్ద పెద్ద మాటలు చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, అశోక్ బాబులు తెలుగువారి పరువు తీశారన్నారు. కిరణ్ పార్టీ పెడితే సీమాంధ్ర ప్రజలు తిప్పి కొట్టడం ఖాయమని, అశోక్ తన పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.
జగన్ నియంతలా..
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి నియంతలా వ్యవహరిస్తున్నారని కర్రా రాజారావు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గ జగన్ పార్టీ సమన్వయకర్తగా ఉన్న ఆయన పార్టీకి రాజీనామా చేసి టిడిపిలోకి చేరుతున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... పది కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప టిక్కెట్టు ఇవ్వబోమనని చెబుతున్నారని ఆరోపించారు. 2009లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కర్రా రాజారావు 2012లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. ఇప్పుడు సొంత గూటికి వచ్చారు.












Click it and Unblock the Notifications