‘అన్యాయం జరుగుతున్నా..! ఇంకా టీడీపీలో ఎందుకు?’
తెలుగుదేశం పార్టీపై మాలమహానాడు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ వివక్ష చూపుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య మండిపడ్డారు.
అమరావతి: తెలుగుదేశం పార్టీపై మాలమహానాడు నేతలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల తెలుగుదేశం పార్టీ వివక్ష చూపుతోందని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కల్లూరి చెంగయ్య మండిపడ్డారు. ఎస్పీలందరూ టీడీపీ నుంచి బయటకు వచ్చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
పార్టీలో మాల, మాదిగ సామాజికవర్గాలకు అన్యాయం జరుగుతోందని వారన్నారు. పార్టీ పదవులు, నామినేటెడ్ పదవుల్లో తగిన న్యాయం జరగడం లేదని చెంగయ్య విమర్శించారు.

ఎన్టీఆర్ హయాంలో ఆర్ అండ్ బీ, రెవెన్యూ, భారీ నీటిపారుదల శాఖలను దళితులకు కేటాయించారని గుర్తు చేశారు. అయితే, చంద్రబాబు హయాంలో దళితులకు సరైన ప్రాతినిథ్యం లేకుండా పోయిందని చెంగయ్య మండిపడ్డారు. పొలిట్ బ్యూరో నుంచి దళిత ఎంపీ శివప్రసాద్‌ను తొలగించారని చెప్పారు.
కాపు సామాజికవర్గీయుల మెప్పు కోసం మంత్రివర్గం నుంచి పీతల సుజాతను తొలగించారని అన్నారు. గిరిజనమండలిలో కూడా రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ నేతలను నామినేట్ చేశారని చెంగయ్య ఆరోపించారు. వైసీపీ అధినేత జగన్ ఒత్తిడి వల్లే గిరిజన సలహామండలిని ఏర్పాటు చేశారని చెప్పారు.
-
ఆళ్లగడ్డ టీడీపీలో కేబుల్ వార్.. భూమా అఖిల Vs సుబ్బారెడ్డి, బంపర్ ఆఫర్ తో చర్చ! -
దేశంలో మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ గా చంద్రబాబు.. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా?












Click it and Unblock the Notifications