ఆటంకాలపై మల్లు ఆగ్రహం: అసెంబ్లీలోనే టిడిపి

ఇదిలావుంటే, సభ రేపటికి వాయిదా పడిన తర్వాత తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభలు శాసనసభ లోపలే ఉన్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లును వ్యతిరేకిస్తూ వారు సభలో బైఠాయించారు. ఈ రాత్రంతా అక్కడే ఉండాలని వారు నిర్ణయించుకున్నారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతిపాదనపై తీవ్ర నిరసన తెలియజేస్తూ వారు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు కూడా రాత్రంతా సభలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
సభ సోమవారం సాయంత్రం మూడు గంటలకు సమావేశనపప్పుడు స్పీకర్ స్థానంలో డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క సమావేశాలకు అధ్యక్షత వహించారు. తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను తెలుగుదేశం సీమాంధ్ర శాసనసభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు చించి మల్లు భట్టి విక్రమార్కపైకి విసిరేశారు
మల్లుభట్టి విక్రమార్కపై బిల్లు ప్రతులు చించి విసిరేయడం వివాదంగా మారింది. దళితుడైన డిప్యూటీ స్పీకర్‌ను సీమాంధ్ర శాసనసభ్యులు అమానించారని తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు విమర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications