జహీరాబాద్‌లో వ్యక్తి మృతి: పోలీసుల దెబ్బకు తాళలేక అంటూ..
తెలంగాణలోని జహీరాబాద్‌లో ఓ జైపాల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హైదరాబాద్: తెలంగాణలోని జహీరాబాద్‌లో ఓ జైపాల్ అనే వ్యక్తి పోలీస్ స్టేషన్‌లోనే పోలీసుల దెబ్బలకు తాళలేక చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
జైపాల్ అనే వ్యక్తిని పోలీసులు మూడు రోజుల క్రితం ఓ కేసులో అదుపులోకి తీసుకున్నారు. బుధవారం సాయంత్రం అతని ఆరోగ్యం బాగా లేకపోవడంతో పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు.

అతను చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు చెబుతున్నారు. కానీ జైపాల్ కుటుంబ సభ్యులు మాత్రం అతనిని పోలీసులు కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications