జగన్ పార్టీ పంపిణీ చేసిన మద్యం సేవించి వ్యక్తి మృతి
హైదరాబాద్: గుంటూరు జిల్లాలో నకిలీ మద్యం సేవించి నాదెండ్ల మండలం గిరిజవోలుకు చెందిన షేక్ సుభానీ అనే వ్యక్తి మృతి చెందాడు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు పంపిణీ చేసిన మద్యం తాగి సుభానీ మృతి చెందినట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
నర్సారావుపేట పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేస్తున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి బంధువులు ఉన్న ఈ గ్రామంలో గత కొన్ని రోజులుగా మద్యం పంపిణీ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
వరంగల్ జిల్లాలోని స్టేషన్‌ఘన్‌పూర్ మండలం చినపెండ్యాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
వృద్ధ దంపతులు ఆత్మహత్య
ప్రకాశం జిల్లాలోని ఒంగోలు రైల్వేస్టేషన్‌లో ఓ వృద్ధ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సంజీవరావు అనే వ్యక్తి బెదిరింపుల వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభ్యమైంది.
సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు శ్రీనివాసరావు, వెంకటలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications