కుళ్లిన భార్య శవం పక్కన తాగిన మత్తులో భర్త

సెంటరిగ్ వర్కర్ జానీ అలియాస్ బుజ్జిని లత పెళ్లి చేసుకుంది. బుజ్జి మొదటి భార్య అతన్ని వదిలేసి పోయింది. దీంతో లత అతనికి రెండో భార్యగా వచ్చింది. తొలుత ఎల్లయ్య తన కూతురితో పాటు ఉండేవాడు. అయితే, బుజ్జితో ఆర్థికపరమైన గొడవలు రావడంతో దూరం జరిగాడు.
మంగళవారం ఉదయం జానీ తన సోదరుడికి తన భార్య మరణించిందని, తాను కూడా అదే దారిలో వెళ్తున్నానని చెప్పాడు. దాంతో జానీ, లత బంధువులు పోలీసులకు విషయం చెప్పి హుటాహుటిన వచ్చారు. ఇరుగుపొరుగువారి, కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులు బలవంతంగా తలుపులు తెరిచారు.
లత శవం పక్కన జానీ తాగిన మత్తులో పడి ఉన్నాడని, భార్య రెండు రోజుల క్రితమే మరణించి ఉంటుందని, అప్పటి నుంచి ఇంట్లోనే జానీ మద్యం సేవిస్తూ ఉండవచ్చునని పోలీసులు అంటున్నారు. లత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని జానీ పోలీసులకు చెప్పాడు. అయితే, ఆమె శవం నేలపై ఉంది.












Click it and Unblock the Notifications